చైనా సీక్రెట్ న్యూక్లియర్ టెస్ట్.. అమెరికా వర్రీ

అణుపాటవ పరీక్షల నిషేధం, ఇందుకు సంబంధించి అమలులో ఉన్న అంతర్జాతీయ ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా చైనా రహస్యంగా తక్కువ స్థాయిలో ఈ పరీక్షలను నిర్వహించడంపై అమెరికా భగ్గుమంది. ఇప్పటికే  ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఆశించిన రీతిలో లేవు. కరోనా వైరస్ చైనా లోని వూహాన్ సిటీ నుంచే పుట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించడం, చైనా దీన్ని ఖండించడం తెలిసిందే. కాగా చైనా తన ‘లోప్ నూర్’ అణు కేంద్రం వద్ద గత ఏడాదంతా […]

చైనా సీక్రెట్ న్యూక్లియర్ టెస్ట్.. అమెరికా వర్రీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 16, 2020 | 7:49 PM

అణుపాటవ పరీక్షల నిషేధం, ఇందుకు సంబంధించి అమలులో ఉన్న అంతర్జాతీయ ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా చైనా రహస్యంగా తక్కువ స్థాయిలో ఈ పరీక్షలను నిర్వహించడంపై అమెరికా భగ్గుమంది. ఇప్పటికే  ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఆశించిన రీతిలో లేవు. కరోనా వైరస్ చైనా లోని వూహాన్ సిటీ నుంచే పుట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించడం, చైనా దీన్ని ఖండించడం తెలిసిందే. కాగా చైనా తన ‘లోప్ నూర్’ అణు కేంద్రం వద్ద గత ఏడాదంతా సీక్రెట్ గా న్యూక్లియర్ టెస్ట్స్ జరిపిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ కూడా ఓ నివేదికలో ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అణు పరీక్షలకు సంబంధించి ‘జీరో ఈల్డ్’ ఒడంబడికను బీజింగ్ అతిక్రమిస్తోందని, ఇది 1996 నాటి ఒప్పందాన్ని  పూర్తిగా ఉల్లంఘించడమేనని ఈ రిపోర్టు దుయ్యబట్టింది.

అణు వార్ హెడ్ ను డెటోనెట్  చేసే పరీక్షల్లో పేలుడు జరగనప్పటికీ.. దీన్ని న్యూక్లియర్ టెస్టుగానే భావిస్తున్నారు. చైనా తన అణుపరీక్షా స్థావరాలను మళ్ళీ తెరిచింది.. పేలుడు పదార్థాలతో కూడిన కంటెయిన్ మెంట్ చాంబర్స్ ను వినియోగిస్తోందని, ఇది తీవ్ర ఆందోళనకరమైనదని ట్రంప్ ప్రభుత్వం విమర్శించింది. అయితే ఇందుకు ఆధారాలను చూపలేదు. పైగా ఓ ఇంటర్నేషనల్ ఏజెన్సీ నిర్వహించే మానిటరింగ్ సెంటర్ కు అనుబంధంగా ఉన్న సెన్సర్స్ నుంచి డేటా ట్రాన్స్ మిషన్లను చైనా బ్లాక్ చేస్తోందని కూడా ట్రంప్ సర్కార్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలపై చైనా స్పందించలేదు.

Latest Articles
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..