నిబంధనలు ఉల్లంఘిస్తూ మంత్రి పుట్టిన రోజు వేడుకలు

| Edited By:

Jun 23, 2020 | 9:00 PM

ప్రజలకు నిబంధనలు పాటించడంటూ చెప్పాల్సిన మంత్రి.. అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. దీంతో సోషల్ డిస్టెన్స్‌ అన్న నిబంధన గాల్లో కలిసిపోయింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన....

నిబంధనలు ఉల్లంఘిస్తూ మంత్రి పుట్టిన రోజు వేడుకలు
Follow us on

ప్రజలకు నిబంధనలు పాటించడంటూ చెప్పాల్సిన మంత్రి.. అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. దీంతో సోషల్ డిస్టెన్స్‌ అన్న నిబంధన గాల్లో కలిసిపోయింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మంత్రి పుట్టిన రోజు వేడుకల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి అమర్‌జీత్‌ భగత్‌ సోమవారం నాడు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారుడు ఈ కార్యక్రమాన్ని అంబికాపూర్‌లో నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రజలకు.. మాస్క్‌లను, బ్లాంకెట్‌లను పంపిణీ చేశాడు మంత్రి కుమారుడు. దీంతో అక్కడికి వచ్చిన ప్రజలు సోషల్ డిస్టెన్స్‌ అన్నది పాటించకుండా.. గుంపులు గుంపులుగా గుమికూడారు. ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు మంత్రిగారు ఇలా వేడుకలు జరుపుకోవడంపై.. ప్రతిపక్ష నాయుకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మీడియాతో ముచ్చటించిన మంత్రి.. ప్రజలంతా సోషల్ డిస్టెన్స్‌ తప్పనిసరిగా పాటించాలని.. మాస్క్‌లు, శానిటైజర్‌లను వాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటూ సూచించారు.