కరోనా టెస్టులపై కీలక నిర్ణయం….రాష్ట్రాలకు కేంద్రం లేఖ

|

Jul 02, 2020 | 6:14 PM

దేశంలో కరోనా వీరా విహారం చేస్తోంది. మరోవైపు కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా 2.0 మొదలైంది. ఇటువంటి సమయంలోనే ప్రజల ప్రాణాలు కాపాడుకోవటంపై మరింత దృష్టిపెట్టాలని చెబుతూ.. కరోనా పరీక్షల కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్న వారికి కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది.

కరోనా టెస్టులపై కీలక నిర్ణయం....రాష్ట్రాలకు కేంద్రం లేఖ
Follow us on

దేశంలో కరోనా వీరా విహారం చేస్తోంది. మరోవైపు కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా 2.0 మొదలైంది. దీంతో మొన్నటి వరకు ఉన్న ఆంక్షలు మరింత ఎత్తివేస్తూ..చాలా వాటికి తాళాలు తీసేసినట్లైంది. ఇటువంటి సమయంలోనే ప్రజల ప్రాణాలను కాపాడుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా పరీక్షల కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్న వారికి కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఇక నుంచి ప్రైవేటు వైద్యులు సహా క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్(క్యూఎంపీ) కూడా అనుమానితులకు ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కరోనా టెస్టుల కోసం సిఫారసు చేయవచ్చని కేంద్రం ప్రకటించింది. ప్రైవేటు రంగంలో పరీక్షలు తక్కువగా జరగడంపై కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ సంయుక్తంగా రాసిన లేఖలో ప్రస్తావించింది.

కోవిడ్ 19 ల్యాబుల్లో పూర్తిస్థాయిలో పరీక్షలు జరిపేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ…అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ సంయుక్తంగా లేఖలు రాసింది. కేంద్రం సూచన మేరకు రాష్ట్రాలు ఏ ఒక్కరిని కరోనా పరీక్షలు చేయించుకోకుండా అడ్డుకోవద్దని పేర్కొంది. కొన్ని రాష్ట్రాలు కేవలం ప్రభుత్వ డాక్టర్లు సూచించిన వారికి మాత్రమే కరోనా టెస్టులు చేయాలని సూచించడాన్ని ప్రస్తావించింది. కరోనా పరీక్షల్లో జాప్యం జరగకుండా, టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు ర్యాపిడ్ యాంటిజన్ టెస్టులు పెంచాలని సూచించింది. లక్షణాలు ఉన్న వారిని పరీక్షించేందుకు పలు ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్స్ ఏర్పాటు చేయాలని, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఏ ఒక్కరిని కరోనా పరీక్షలు చేయించుకోకుండా అడ్డుకోవద్దని సూచిస్తూ అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది.