ఆహార భద్రత కార్డు దారులకు ఊరట..జూన్‌లోనూ..

|

May 26, 2020 | 2:06 PM

కరోనా, లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ఉపాధిలేక, చేతిలో డబ్బులేక నిరుపేదలు, దినసరి కూలీలు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలేవరూ ఆకలితో పస్తులుండరాదని భావించిన ప్రభుత్వం..

ఆహార భద్రత కార్డు దారులకు ఊరట..జూన్‌లోనూ..
Follow us on

కరోనా, లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ఉపాధిలేక, చేతిలో డబ్బులేక నిరుపేదలు, దినసరి కూలీలు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలేవరూ ఆకలితో పస్తులుండరాదని భావించిన ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించింది. ఇప్పటికే రెండుసార్లు ఉచిత బియ్యం పంపిణీ చేసింది. ఇక జూన్ 1 నుంచి మూడోసారి పంపిణీకి సిద్ధమవుతోంది.
దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో లాక్‌డౌన్ కారణంగా పేద వారికి చేతిలో డబ్బు లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో వారికి ఉచిత బియ్యం ఇప్పటికే రెండుసార్లు పంపిణీ చేయడం జరిగింది. ఇక జూన్ 1 నుంచి మూడోసారి పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఆహార భద్రత కార్డు ఉన్న అందరికీ బియ్యం ఇచ్చేందుకు కేంద్రం రూ.46వేల కోట్లు మంజూరు చేసింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 120 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనుంది. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరూ ఉచిత బియ్యాన్ని పొందే అవకాశం ఉంది. ఒక్కో వ్యక్తికీ 12 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. అలాగే… కేజీ కందిపప్పు కూడా ఇవ్వనున్నారు. తెలంగాణలో 87.55 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ ప్రకారం 2.80 కోట్ల మంది లబ్దిదారులుగా ఉన్నారు. వారికి ఒక్కొక్కరికీ 12 కేజీల బియ్యం ఇవ్వాలి కాబట్టి.. మొత్తం 3.34 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ షాపులకు పంపుతున్నారు. అలాగే 27 వేల టన్ను కందిపప్పును కూడా పంపుతున్నారు.