లాక్ డౌన్ 4.0.. బస్సులకు అనుమతి దొరికేనా!

|

May 15, 2020 | 5:57 PM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇక ఈ నెల 18 నుంచి నాలుగోదశ లాక్ డౌన్ అమలు కానుంది. ఈ దశలో ఎలాంటి సడలింపులు కేంద్రం ఇస్తుందన్నది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నాలుగోదశ లాక్ డౌన్ పూర్తిగా కొత్తగా ఉంటుందని.. సరికొత్త రూల్స్ ఉంటాయని ఇప్పటికే ప్రధాని మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాల్లో […]

లాక్ డౌన్ 4.0.. బస్సులకు అనుమతి దొరికేనా!
Follow us on

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇక ఈ నెల 18 నుంచి నాలుగోదశ లాక్ డౌన్ అమలు కానుంది. ఈ దశలో ఎలాంటి సడలింపులు కేంద్రం ఇస్తుందన్నది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నాలుగోదశ లాక్ డౌన్ పూర్తిగా కొత్తగా ఉంటుందని.. సరికొత్త రూల్స్ ఉంటాయని ఇప్పటికే ప్రధాని మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాల్లో హాట్ స్పాట్స్, రెడ్ జోన్స్ కానీ ఏరియాస్‌లో బస్సులు నడిపే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర వర్గాల సమాచారం. నాన్ కంటైన్మెంట్ జోన్లలో ఆటోలు, ట్యాక్సీలను ప్రయాణీకుల సంఖ్యను కుదించి నడపనున్నారని తెలుస్తోంది. అటు అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు సైతం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ట్రావెల్ పాసులు ఉన్న ప్రయాణీకులు మాత్రమే మరో రాష్ట్రానికి ప్రయాణం చేసే వీలు ఉంటుందని సమాచారం. కాగా, దేశీయ విమానాలు కూడా ఈ నెల 18 నుంచి తిరిగే అవకాశాలు ఉన్నాయి.

Read This: దేశంలో కొత్త వైరస్ కలకలం.. 15,000 పందులు మృతి..