క‌రోనా వైర‌స్‌తో బాధపడుతూ 222 రోజులు ఆస్పత్రిలోనే.. అత్య‌ధిక కాలం పాటు బాధ‌ప‌డ్డ వ్య‌క్తి ఇత‌డేన‌ట‌

|

Dec 22, 2020 | 8:52 AM

ప్ర‌పంచాన్నిగ‌జ‌గ‌జ వణికిస్తున్న క‌రోనా మ‌హమ్మారి ఎంద‌రినో పొట్ట‌న‌పెట్టుకుంది. వైర‌స్ బారిన ప‌డి ఎంద‌రో ఆస్ప‌త్రి పాల‌వుతున్నారు. క‌రోనా ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన న‌ష్టం అంతా ఇంతా కాదు...

క‌రోనా వైర‌స్‌తో బాధపడుతూ 222 రోజులు ఆస్పత్రిలోనే.. అత్య‌ధిక కాలం పాటు బాధ‌ప‌డ్డ వ్య‌క్తి ఇత‌డేన‌ట‌
Follow us on

Britain’s Person hospitalized for 222 days suffering from coronavirus: ప్ర‌పంచాన్నిగ‌జ‌గ‌జ వణికిస్తున్న క‌రోనా మ‌హమ్మారి ఎంద‌రినో పొట్ట‌న‌పెట్టుకుంది. వైర‌స్ బారిన ప‌డి ఎంద‌రో ఆస్ప‌త్రి పాల‌వుతున్నారు. క‌రోనా ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన న‌ష్టం అంతా ఇంతా కాదు. దీర్ఘ‌కాలిక వ్యాధి ల‌క్ష‌ణాలున్న‌వారు కూడా ఒక నెల‌కంటే ఎక్కువ ఆస్ప‌త్రిలో చికిత్స పొంద‌లేదు. కానీ బ్రిట‌న్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఏకంగా క‌రోనాతో 222 రోజులు ఆస్ప‌త్రిలో ఉన్నాడు. ఈ కోవిడ్ మ‌హ‌మ్మారితో అత్య‌ధిక కాలం పాటు బాధ‌ప‌డ్డ వ్య‌క్తి ఇత‌డేన‌ట‌. క్రిస్మ‌స్‌కు కొద్ది రోజుల ముందే డిశ్చార్జ్ అయి ఇంటికి రావ‌డంతో కుటుంబ స‌భ్యులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

యూకేకు చెందిన అలీ స‌క‌ల్లియోగ్లూ (57) క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేరాడు. దాదాపు క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేరిన వారు అత్య‌ధికంగా అంటే నెల రోజుల పాటు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అవుతుంటారు. కానీ అత‌ను మాత్రం ఏకంగా 222 రోజులు ఆస్ప‌త్రిలోనే ఉన్నాడు. అత‌నికి చికిత్స చేస్తున్న ఆస్ప‌త్రి సిబ్బంది అత‌ని ప్రాణాల‌పై ఆశ‌లు వ‌దులుకోవాల‌ని కుటుంబ స‌భ్యుల‌కు తెలిపారు.

లైఫ్ స‌పోర్టు మెషీన్ల‌ను ఆపివేశారు. ఇప్పుడు అత‌ను క‌రోనా నుంచి జ‌యించి ఇంటికి చేరాడు. పండ‌గ‌కు ముందే క‌రోనా నుంచి కోలుకుని ఇంటికి రావ‌డంతో ఇదంతా క్రిస్మ‌స్ మిరాకిల్ అంటూ కుటుంబ స‌భ్యులు సంతోష‌ప‌డుతున్నారు.

కరోనా టీకా తీసుకున్న జో బైడెన్.. ప్రజల్లో లేనిపోని అపోహాలు పోగొట్టేందుకే ఈ టీకా తీసుకున్నా..