కరోనా మరణాలను తగ్గిస్తోన్న ‘బీపీ మందులు’

| Edited By:

Aug 24, 2020 | 5:16 PM

కరోనా సోకిన వారికి ఏవైనా జబ్బులు ఉన్నట్లైయితే ఇబ్బంది అవుతుందని ఇప్పటికే పలు సర్వేలు తెలిపాయి. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్‌, డయాబెటీస్‌, కాలేయ ఇబ్బందులు

కరోనా మరణాలను తగ్గిస్తోన్న బీపీ మందులు
Follow us on

BP Drugs for Corona patients: కరోనా సోకిన వారికి ఏవైనా జబ్బులు ఉన్నట్లైయితే ఇబ్బంది అవుతుందని ఇప్పటికే పలు సర్వేలు తెలిపాయి. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్‌, డయాబెటీస్‌, కాలేయ ఇబ్బందులు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న వారికి కరోనా సోకితే ప్రాణాంతకమవుతుందని డాక్టర్లు సైతం చెబుతున్నారు. అయితే ఈ వైరస్ బారిని హై బ్లడ్ ప్రెషర్ రోగులకు బీపీ మందులు ఇవ్వడం వలన వారు కోలుకుంటున్నారని లండన్‌లో నిర్వహించిన ఓ తాజా సర్వేలో వెల్లడైంది.  కరోనా సోకిన బీపీ రోగులకు రామిప్రిల్, లొసార్టన్‌ మందులు ఇవ్వగా.. అందులో 33 శాతం మంది ప్రాణాపాయం నుంచి కోలుకున్నారని ‘యూనివర్శిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లినా’ పరిశోధకులు తెలిపారు.

వారిలో ఎక్కువ శాతం మంది వెంటిలేటర్‌ వరకు కూడా వెళ్లకుండానే కోలుకున్నారని, వెంటిలేటర్‌పై ఉన్న రోగులు కూడా ఈ మందులతో కోలుకున్నారని పరిశోధకులు తెలిపారు. అయితే బీపీ లేని కరోనా రోగులపై ఈ మందుల ప్రభావం ఎలా ఉంటుందన్న దానికి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.

Read More:

కరోనా రోగుల కోసం పోలీసుల సాహసం.. డీజీపీ ప్రశంసలు

సినీ పెద్దలతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ