గుడ్‌న్యూస్‌: కరోనా‌ వ్యాక్సిన్‌పై ఐసీఎంఆర్‌ ప్రకటన‌.. ఆగష్టు 15న మార్కెట్‌లోకి

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో దేశ ప్రజలకు నిజంగా ఇది శుభవార్తే. కరోనాపై పోరులో భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మరో అడుగు ముందుకేసింది.

గుడ్‌న్యూస్‌: కరోనా‌ వ్యాక్సిన్‌పై ఐసీఎంఆర్‌ ప్రకటన‌.. ఆగష్టు 15న మార్కెట్‌లోకి

Edited By:

Updated on: Jul 03, 2020 | 9:47 AM

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో దేశ ప్రజలకు నిజంగా ఇది శుభవార్తే. కరోనాపై పోరులో భారత వైద్య పరిశోధన మండలి(ICMR) మరో అడుగు ముందుకేసింది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్(BBIL) కలిసి కరోనాకు ‘కోవాక్సిన్‌’ అనే మందును తయారు చేస్తోన్న ఐసీఎంఆర్‌.. దాన్ని ఆగష్టు 15న విడుదల చేయబోతోంది. ఈ మేరకు ఐసీఎంఆర్ గురువారం అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

”అన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ను పూర్తి చేసుకొని ఈ ఏడాది ఆగష్టు 15న కరోనాకు వ్యాక్సిన్‌ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఇందులో భాగంగా భారత్‌ బయోటెక్‌ ట్రయల్స్‌ను ముమ్మరం చేసింది. ఏదేమైనా క్లినికల్ ట్రయల్స్‌ అన్నీ విజయవంతంగా పూర్తైన తరువాతే వ్యాక్సిన్‌ని మార్కెట్‌లోని విడుదల చేస్తాం” అని ఐసీఎంఆర్, భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఉంది. స్వదేశీ పరిఙ్ఞానంతోనే ఈ వ్యాక్సిన్‌ రాబోతుంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ జంతువుల్లో ఫలితాలను ఇవ్వగా.. మనుషులపై కూడా ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.

ఇందుకోసం దేశవ్యాప్తంగా 12 ఇనిస్టిట్యూట్‌లను ఐసీఎంఆర్‌ ఎంపిక చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లో ఫాస్ట్‌ ట్రాక్ ట్రయల్స్‌ను నిర్వహించనున్నారు. అంతేకాదు వ్యాక్సిన్‌ పనితీరును ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఒకవేళ వ్యాక్సిన్‌ విజయవంతమైతే కరోనాతో దేశ ప్రజలకు భారీ ఊరట లభించినట్లే.