పశ్చిమ బెంగాల్.. జులై 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన దీదీ ప్రభుత్వం

| Edited By: Pardhasaradhi Peri

Jun 24, 2020 | 8:09 PM

పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం కరోనా వైరస్ లాక్ డౌన్ ని జులై 31 వరకు పొడిగించింది. ప్రస్తుత లాక్ డౌన్ కాల పరిమితి ఈ నెల 30 తో ముగియనుండగా దీదీ సర్కార్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కేసులు..

పశ్చిమ బెంగాల్.. జులై 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన దీదీ ప్రభుత్వం
Follow us on

పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం కరోనా వైరస్ లాక్ డౌన్ ని జులై 31 వరకు పొడిగించింది. ప్రస్తుత లాక్ డౌన్ కాల పరిమితి ఈ నెల 30 తో ముగియనుండగా దీదీ సర్కార్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లాక్ డౌన్ ని పొడిగించిన నేపథ్యంలో రైలు, మెట్రో సర్వీసులు కూడా నడవవని, అలాగే స్కూళ్ళు, కాలేజీలు కూడా జులై 31 వరకు మూసి ఉంటాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి. బెంగాల్ లో 14,728 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. 580 మంది కరోనా రోగులు మృతి చెందారు.కాగా.. మమత ప్రభుత్వం తీసుకున్న హఠాత్ నిర్ణయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.