గుట్ట‌లుగా చ‌చ్చిప‌డిన గ‌బ్బిలాలు..హ‌డ‌లెత్తిపోతున్న గ్రామ‌స్తులు

| Edited By: Pardhasaradhi Peri

Apr 30, 2020 | 3:43 PM

చైనాలోని వుహ‌న్‌లో పుట్టిన క‌రోనా వైర‌స్ గ‌బ్బిలాల నుంచే మ‌నుషుల‌కు సంక్ర‌మించింద‌ని ప్ర‌చారంలో ఉంది. ఇటువంటి త‌రుణంలో ఓ గ్రామ శివారులో గుట్ట‌లుగా గ‌బ్బిలాలు చ‌నిపోయిన

గుట్ట‌లుగా చ‌చ్చిప‌డిన గ‌బ్బిలాలు..హ‌డ‌లెత్తిపోతున్న గ్రామ‌స్తులు
Follow us on

చైనాలోని వుహ‌న్‌లో పుట్టిన క‌రోనా వైర‌స్ గ‌బ్బిలాల నుంచే మ‌నుషుల‌కు సంక్ర‌మించింద‌ని ప్ర‌చారంలో ఉంది. ఇటువంటి త‌రుణంలో ఓ గ్రామ శివారులో గుట్ట‌లుగా గ‌బ్బిలాలు చ‌నిపోయిన ఉండ‌టంతో అక్క‌డి స్థానికులంతా క‌రోనా భ‌యంతో హ‌డ‌లెత్తిపోతున్నారు. అటు వైపు వెళ్లేందుకు కూడా జ‌నం భ‌య‌ప‌డిపోతున్నారు. వివ‌రాల్లోకి వెళితే..

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో ఈ దృశ్యం వెలుగు చూసింది. మీర‌ట్‌లోని ఓ చెరువు స‌మీపంలో గ‌బ్బిలాలు
పెద్ద సంఖ్య‌లో గ‌బ్బిలాలు చ‌నిపోయి క‌నిపించాయి. దీంతో గ్రామ‌స్తులంతా భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.  దీంతో అటు వైపు వెళ్లేందుకు కూడా ఎవ‌రూ సాహ‌సించ‌టం లేదు. చివ‌ర‌కు అధికారుల‌కు స‌మాచారం చేర‌టంతో అట‌వీ శాఖ అధికారులు, ప‌శువైద్యాధికారులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చ‌నిపోయిన గ‌బ్బిలాల‌ల‌ను పోస్టుమార్టం కోసం త‌ర‌లించారు. ఇదిలా ఉంటే మీరట్‌లోని గంగానగర్‌లోని శివ్లోక్ కాలనీలో కొందరు కరోనాకు భయపడి గబ్బిలాలను నాటు తుపాకులతో కాల్చి చంపేస్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు.
వ‌రుస‌గా రెండు, మూడు రోజులుగా గ‌బ్బిలాలు చ‌నిపోతున్నాయ‌ని, గ్రామ‌స్తులు వాపోతున్నారు. త‌మ గ్రామానికి ఏం జ‌ర‌గ‌బోతుందోన‌ని బెంబేలెత్తిపోతున్నారు. మ‌రోవైపు గ‌బ్బిలాల మృతిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఎవ‌రైనా వాటిని కావాల‌నే చంపేస్తున్నారా..? లేదంటే పొలాల్లో చ‌ల్లే పురుగు మందు కార‌ణంగా గ‌బ్బిలాలు చ‌నిపోయాయా…? అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.