ఇకపై 20 నిమిషాల్లోనే కరోనాను కనిపెట్టొచ్చు..

|

Jul 19, 2020 | 5:57 PM

కరోనా వచ్చిందో లేదో.? ఇకపై తక్కువ సమయంలోనే తేలిపోనుంది. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు 20 నిమిషాల వ్యవధిలో కరోనాను నిర్ధారించే కొత్తరకం బ్లడ్ టెస్ట్‌ను అభివృద్ధి చేశారు.

ఇకపై 20 నిమిషాల్లోనే కరోనాను కనిపెట్టొచ్చు..
Follow us on

new blood test to trace coronavirus: కరోనా వచ్చిందో లేదో.? ఇకపై తక్కువ సమయంలోనే తెలిసిపోనుంది. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు 20 నిమిషాల వ్యవధిలో కరోనాను నిర్ధారించే కొత్తరకం బ్లడ్ టెస్ట్‌ను అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష ద్వారా కరోనా సోకినవారినే కాకుండా కరోనా బారినపడి కోలుకున్నవారిని సైతం గుర్తించవచ్చునట. అలాగే వ్యాక్సిన్ పరీక్షల్లో అవసరమైన యాంటీబాడీల వృద్దిని కూడా ఈ పరీక్షల ద్వారా త్వరగా తెలుసుకోవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.

ఇటీవల పరిశోధకులు 25 మైక్రోలీటర్ల ప్లాస్మాను ఉపయోగించి కోవిడ్ 19 కేసులను గుర్తించినట్లు వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా పాజిటివ్ కేసులు ఎర్ర రక్త కణాల క్లస్టరింగ్‌కు కారణమవుతాయి. ఇక దీన్ని కంటితో సులభంగా గుర్తించవచ్చు. పరిశోధకులు కేవలం 20 నిమిషాల్లోనే పాజిటివ్, నెగటివ్ రీడింగ్స్ పొందవచ్చునని మోనాష్ యూనివర్సిటీ పేర్కొంది.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..

సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..

2.5 కోట్ల ఇరానీయులకు కరోనా.. దేశాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..