ఏపీ సీఎం సహాయ నిధికి రూ. కోటీ 13లక్షల విరాళం

కరోనా కట్టడి, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి అనేక మంది దాతలు తమ విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌

ఏపీ సీఎం సహాయ నిధికి రూ. కోటీ 13లక్షల విరాళం

Updated on: Jul 16, 2020 | 7:54 PM

కరోనా కట్టడి, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి అనేక మంది దాతలు తమ విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ నవ్యాంధ్రప్రదేశ్‌ తరపున రూ.1 కోటి 13 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ఈ మేరకు 285 నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ తరపున విరాళానికి సంబంధించిన చెక్కును తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కె మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ త్రినాథ్ లు అందజేశారు.

ఇకపోతే, రాష్ట్రంలో ప్రజారోగ్యంపై మరింత ఫోకస్ పెట్టిన ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోగ్యశ్రీని మరింత పటిష్టం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మరో 87 చికిత్సా విధానాలు చేర్చారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి గురువారం జారీ చేశారు. రూ. వెయ్యి నుంచి రూ. 47 వేల వరకు ఖర్చయ్యే 87 చికిత్సా విధానాలను కొత్తగా ఆరోగ్య శ్రీ పథకంలోకి చేర్చారు.