మేమూ కరోనా రోగుల సేవలో.. ఆర్మీ డాక్టర్ల చొరవ

ఢిల్లీలోని అతిపెద్ద క్వారంటైన్ కేంద్రాన్ని సైనిక డాక్టర్లు, నర్సులు టేకోవర్ చేసుకున్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద కేంద్రమని అధికార వర్గాలు తెలిపాయి. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని నారెలా ఏరియాలో గల ఈ క్వారంటైన్ సెంటర్లో.. గత నెల నిజాముద్దీన్ మసీదులో జరిగిన మత పర కార్యక్రమానికి హాజరైన సుమారు 900 మందికి పైగా ఉన్నారు. కరోనా కేసుల అదుపునకు ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే ఈ కేంద్రాన్ని ప్రారంభించింది. అప్పటినుంచి సైన్యం ఈ కేంద్రానికి తనవంతు సాయాన్ని […]

మేమూ కరోనా రోగుల సేవలో.. ఆర్మీ డాక్టర్ల చొరవ

Edited By:

Updated on: Apr 19, 2020 | 7:19 PM

ఢిల్లీలోని అతిపెద్ద క్వారంటైన్ కేంద్రాన్ని సైనిక డాక్టర్లు, నర్సులు టేకోవర్ చేసుకున్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద కేంద్రమని అధికార వర్గాలు తెలిపాయి. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని నారెలా ఏరియాలో గల ఈ క్వారంటైన్ సెంటర్లో.. గత నెల నిజాముద్దీన్ మసీదులో జరిగిన మత పర కార్యక్రమానికి హాజరైన సుమారు 900 మందికి పైగా ఉన్నారు. కరోనా కేసుల అదుపునకు ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే ఈ కేంద్రాన్ని ప్రారంభించింది. అప్పటినుంచి సైన్యం ఈ కేంద్రానికి తనవంతు సాయాన్ని అందిస్తోంది. సైనిక డాక్టర్లు, ఇతర స్టాఫ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు ఇక్కడ రోగులకు తమ సేవలందించనున్నారు. ఈ మధ్య సుమారు 200 మంది విదేశీ వైద్య సిబ్బంది కూడా ఈ కేంద్రంలో రోగులకు చికిత్స చేశారు.