ప్రైవేటు బస్సులకు అనుమతి.. ఇవే నియమ నిబంధనలు

ప్రైవేటు బస్సులు, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ క్యాబ్, ఆటో రిక్షాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా డీటీసీ ఎస్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధలను పాటిస్తూ వాహనాలను నడపాలని ఆయన కోరారు. అలాగే కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతున్న కారణంగా...

ప్రైవేటు బస్సులకు అనుమతి.. ఇవే నియమ నిబంధనలు

Edited By:

Updated on: Jun 20, 2020 | 4:01 PM

ప్రైవేటు బస్సులు, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ క్యాబ్, ఆటో రిక్షాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా డీటీసీ ఎస్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధలను పాటిస్తూ వాహనాలను నడపాలని ఆయన కోరారు. అలాగే కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రయాణికులను చేరవేసే వాహనాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని వెంకటేశ్వరరావు తెలియజేశారు.

నియమ-నిబంధనలు

– ప్రతీ ప్రయాణికుడిని థర్మల్ స్కానింగ్ చేయాలి. థర్మల్ స్కానింగ్‌లో చూపించే ఉష్ణోగ్రతను బట్టి ప్రయాణికులను లోనికి అనుమతించాలి
– అన్ని ప్రైవేటు బస్సుల్లో, క్యాబుల్లో, టాక్సీల్లో, ఆటోల్లో ఉచిత శానిటైజర్ ఏర్పాటు చేయాలి
– ప్రయాణికులు దిగిన వెంటనే బస్సులను, క్యాబ్‌లను, ఆటోలను
శానిటైజ్ చేయాలి
– ప్రతీ పాసింజర్‌కి ఒక సూట్ కేస్ లేదా బ్యాగులను మాత్రమే అనుమతించాలి
– డ్రైవర్ తన క్యాబిన్‌లో మాత్రమే ఉండాలి. వాహనం ఆగినప్పుడు బయటకు దిగడం గానీ, తిరగటం గానీ చేయకూడదు
– ప్రయాణికులందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి
– వాహనాల్లో ఏసీ సౌకర్యం 26 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద ఉండాలి
– పొడి దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడం వంటి కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రయాణికులను వాహనంలో అనుమతించకూడదు
– డ్రైవర్‌తో సహా ఐదుగురు కూర్చునే సామర్థ్యంతో మ్యాక్సీ-క్యాబ్‌లు అనుమతించబడతాయి
– డ్రైవర్‌తో పాటు ముగ్గురు కూర్చునే సామర్థ్యంతో ఆటో రిక్షాలు అనుమతించబడతాయి
– కార్లలో డ్రైవర్ మరో ఇద్దరు ప్రయాణికులు కలిసి ముగ్గురిని అనుమతిస్తారు. కేంద్ర విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారమే వాహనాలు నడపాలని డీటీసీ ఎస్ వెంకటేశ్వర రావు కోరారు.

Read More: 

పీఎం కీలక నిర్ణయం.. వలస కూలీల లబ్ధి కోసం ప్రత్యేక పథకం..

ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌నం.. అప్లై చేసిన ప‌ది పనిదినాల్లో పెన్ష‌న్…

ఒకే రోజు ‘ఏడు స్పెషల్ డేస్’.. ప్రపంచం అంతంతో పాటు..