కరోనాతో కర్నూలులో మరో ఇద్దరు మృతి..4కి చేరిన మృతుల సంఖ్య..

ఏపీలో క‌రోనా మృత్యుఘంటిక‌లు మోగిస్తోంది. క‌ర్నూలు జిల్లాలో మ‌రో ఇద్ద‌రు క‌రోనా బారిన‌ప‌డి మృత్యువాత‌ప‌డ్డారు. కర్నూలు నగర

కరోనాతో కర్నూలులో మరో ఇద్దరు మృతి..4కి చేరిన మృతుల సంఖ్య..

Updated on: Apr 18, 2020 | 4:02 PM

ఏపీలో క‌రోనా మృత్యుఘంటిక‌లు మోగిస్తోంది. క‌ర్నూలు జిల్లాలో మ‌రో ఇద్ద‌రు క‌రోనా బారిన‌ప‌డి మృత్యువాత‌ప‌డ్డారు. కర్నూలు  నగర శివారులోని విశ్వభారతి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నక‌రోనా పెషేంట్ మృతిచెందాడు. మృతుడు నగరంలోని బుధవార పేట కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. స్థానిక‌ పాతబస్తీ లోని గని గాలి కి చెందిన మరో వ్యక్తి ఈ రోజు ఉదయం మరణించాడు. దీంతో ఒక్క క‌ర్నూలు జిల్లాలో కరోనా తో మృతి చెందినవారి సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఇక జిల్లాలో శనివారం మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో బాధితుల సంఖ్య 129 కి చేరుకుంది. కాగా, కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం 17 మంది మరణించారు.నేటి వరకు మొత్తం 603 కేసులు నమోదయ్యాయి..