‘సర్తల్‌దేవి‘ యాత్రకు కరోనా బ్రేక్

|

Jun 26, 2020 | 12:28 PM

కరోనా లాక్‌డౌన్ కారణంగా మూతపడిన గుళ్లు, గోపురాలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..దైవ దర్శనాలకు వెళ్తున్నారు. ఇటువంటి తరుణంలో జమ్మూకశ్మీర్‌లో ప్రతీ ఏటా జరిగే సర్తల్‌దేవీ యాత్రపై కరోనా ప్రభావం పడింది.

‘సర్తల్‌దేవి‘ యాత్రకు కరోనా బ్రేక్
Follow us on

కరోనా లాక్‌డౌన్ కారణంగా గత 80 రోజులకు పైగా మూతపడిన గుళ్లు, గోపురాలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..దైవ దర్శనాలకు వెళ్తున్నారు. ఇటువంటి తరుణంలో జమ్మూకశ్మీర్‌లో ప్రతీ ఏటా జరిగే సర్తల్‌దేవీ యాత్రపై కరోనా ప్రభావం పడింది. వైరస్ వ్యాప్తి తగ్గకపోవటంతో సర్తల్‌దేవీ యాత్రను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

కిష్టవార్‌ జిల్లాలోని పిర్‌ పంజాల్‌ పర్వత శ్రేణిలో ఉంది సర్తాల్‌ దేవీ ఆలయం. ప్రతీ యేటా జూన్ 28వ తేదీన సర్తల్ యాత్ర ప్రారంభమవుతోంది. కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో మాతా శ్రీ సర్తల్‌దేవీజీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ విక్రమాదిత్య సింగ్ వెల్లడించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడ కుండా, కరోనా నిబంధనల ప్రకారం ఆలయంలో సంప్రదాయపద్థతిలో పూజలు, యజ్ఞాలు నిర్వహిస్తామని చెప్పారు. యాత్ర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో  కిష్టవార్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డిప్యూటీ కమిషనర్‌ కరోనా కట్టడి కోసం ఆంక్షలు అమలు చేస్తున్నారు.  కోవిడ్ ఆంక్షల కారణంగా.. ఈ ఏడాది ఉత్సవాలను వైస్‌చైర్మన్‌ సంజీవ్‌ పరిహార్‌, మేనెజ్‌మెంట్‌ కౌన్సిల్‌లోని మరికొంత మంది సభ్యులతో కలిసి ఆలయ ఆవరణంలో నిరాడంబరంగా జరుపనున్నట్లు వెల్లడించారు.

ఇకపోతే, జమ్ముకశ్మీర్‌లో గురువారం(జూన్ 25న) 127 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 6,549కి చేరగా, 3967 మంది కోలుకున్నారు. మరో 2492 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.