Andhra Pradesh Coronavirus Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే భారీగా కేసులు నమోదవుతుండడం అధికారుల్లో టెన్షన్ మొదలైంది. 24గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10 వేల కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూడడం విశేషం. వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా, గడిచిన 24 గంటలల్లో కొత్తగా 10 వేల 057 కరోనా కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. 2022, జనవరి 19వ తేదీ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. నిన్న ఒక్కరోజు 41 వేల 713 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. కాగా ప్రస్తుతం ఏపీలో ప్రస్తుతం 44 వేల 935 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది. ఇక, కరోనా కారణంగా నిన్న విశాఖలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందినట్లు బులెటిన్ లో తెలిపింది. ఇక, ఇప్పటివరకు వైరస్ కారణంగా 14 వేల 522 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 1,222 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో మొత్తంగా 3,19,64,682 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక, జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులను పరిశీలిస్తే.. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1, 827 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో 1,822 కేసులు, గుంటూరు జిల్లాలో 943 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 919 కేసులు, అనంతపురం జిల్లాలో 861 కొత్త పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. కడప 482, కృష్ణా జిల్లాలో 332, కర్నూలు 452, నెల్లూరు 698, ప్రకాశం 716, శ్రీకాకుళం 407, విజయనగరం 382, పశ్చిమ గోదావరి జిల్లాలో 216 కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,057 కేసులు నమోదయ్యాయి.
Read Also… High Court: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజుల పెంపు జీవో కొట్టివేసిన హైకోర్టు!