ఏపీలో మరోసారి కరోనా కలవరం.. గడిచిన 24గంటల్లో కొత్తగా 60 పాజిటివ్ కేసులు

|

Feb 16, 2021 | 8:34 PM

మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 60 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

ఏపీలో మరోసారి కరోనా కలవరం.. గడిచిన 24గంటల్లో కొత్తగా 60 పాజిటివ్ కేసులు
Andhra Pradesh Corona Updates
Follow us on

AP coronavirus :

మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 60 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈమేరకు ఇవాళ సాయంత్రం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇక, కరోనా వైరస్‌ బారినపడిన వారిలో 140 మంది గడిచిన 24 గంటల్లో చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్గంగా 8,88,959 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. కాగా, ఈ మహమ్మారి నుంచి 8,81,181 మంది చికిత్సకు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మరో 615 మంది చికిత్స పొందుతున్నారు.

మరోవైపు. మాయదారి వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు 7,163 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో ఇవాళ కొత్తగా 24,311 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో కలుపుకుని ఇప్పటి వరకు 1,35,89,373 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.