AP Corona cases: ఏపీలో కట్టు తప్పుతున్న కరోనా వైరస్.. 5 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

|

Apr 15, 2021 | 5:44 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృ కొనసాగుతోంది. మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

AP Corona cases: ఏపీలో కట్టు తప్పుతున్న కరోనా వైరస్.. 5 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
Ap Corona
Follow us on

AP covid 19: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృ కొనసాగుతోంది. మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35,741 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 5,086 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,42,135 మంది వైరస్‌ బారినపడినట్లు ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

కాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్‌ రాకాసి కోరలకు 14 మంది ప్రాణాలను వదిలారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు చనిపోయారు. అనంతపురం, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,353కి చేరింది.

ఇక, 24 గంటల వ్యవధిలో 1,745 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,03,072కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్‌ కేసులున్నట్లు పేర్కొంది. మొత్తంగా చూస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,70,201 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

కాగా, ఇవాళ కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 617, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పశ్చిమ గోదావరి, కడప మినహా మిగతా అన్ని జిల్లాల్లో 200కుపైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాల వారీగా నమోదైన కోవిడ్ కేసులు ఇలా ఉన్నాయిః

Ap Corona

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. కరోనాపై నిత్యం అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఇవాళ్టి నుంచి 104 కాల్‌ సెంటర్‌పై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎవరికైనా చికిత్స, బెడ్‌ కావాలంటే ఆ కాల్‌ సెంటర్‌ ద్వారా సేవలందించాలని.., హోం ఐసొలేషన్, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ లేదా ఆస్పత్రిలో చేర్చడానికి వైద్యుల సూచనల మేరకు సేవలందించాలని సూచించారు.

ప్రతి గ్రామంలో అంబులెన్సు సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సహాయంతో రోగికి వేగంగా వైద్య సేవలందించాలని చెప్పారు. రోగి ఫోన్‌ చేసిన 3 గంటల్లోగా ఆస్పత్రిలో బెడ్‌ సమకూర్చాలన్నారు. గ్రీవెన్సుల కోసం 1902, కోవిడ్‌ సేవల కోసం 104 వినియోగించాలని.. ఈ రెండింటినీ విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను బస్టాండ్‌ వంటి పబ్లిక్‌ ప్లేసెస్‌లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నారు.

Read Also..కోవిడ్ టీకా కొరతను అధిగమించేందుకు కేంద్రం ప్రణాళికలు.. విదేశీ వ్యాక్సిన్ల అనుమతిపై మూడు రోజుల్లో నిర్ణయం!