ఏపీలో రోజురోజుకీ పెరుగుతోన్న కోవిడ్ కేసులు.. తాజాగా ఎన్నంటే?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం కొత్తగా 2,584 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఇవాళ ఒక్క రోజే 40 మంది మృతి చెందారు. తూర్పు గోదావరిలో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది..

ఏపీలో రోజురోజుకీ పెరుగుతోన్న కోవిడ్ కేసులు.. తాజాగా ఎన్నంటే?

Edited By:

Updated on: Jul 16, 2020 | 3:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం కొత్తగా 2,584 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఇవాళ ఒక్క రోజే 40 మంది మృతి చెందారు. తూర్పు గోదావరిలో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, చిత్తూరులో ఐదుగురు, కడపలో నలుగురు, అనంత పూర్‌లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖలో ముగ్గురు, కర్నూలులో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 38,044కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 492 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం 18159 క‌రోనా యాక్టివ్ కేసులు ఉండగా, 19,393 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక గురువారం కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురంలో 174, చిత్తూరులో 205, ఈస్ట్ గోదావరిలో 500, గుంటూరులో 139, కడపలో 126, కృష్ణలో 132, కర్నూలులో 590, నెల్లూరులో 126, ప్రకాశంలో 104, శ్రీకాకుళంలో 111, విశాఖపట్నంలో 81, విజయనగరంలో 101, వెస్ట్ గోదావరిలో 195 కేసులు నమోదయ్యాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో 22,304 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా 2,584 మందికి కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది.

Read More:

కరోనాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ వైరస్ రాని వ్యక్తి ఉండకపోవచ్చు..

తిరుమలలో అర్చకులకు కరోనా.. టీటీడీ ఛైర్మన్ అత్యవసర భేటీ..

దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు..