‘నేనూ క్వారంటైన్ ముద్ర వేయించుకున్నా’.. బిగ్ బీ

కరోనా నివారణకు జరుగుతున్న కృషిలో తాను కూడా పాలుపంచుకుంటున్నానని ప్రకటించారు బాలీవుడ్ బాద్ షా బిగ్ బీ అమితాబ్ బచ్ఛన్.

నేనూ క్వారంటైన్ ముద్ర వేయించుకున్నా.. బిగ్ బీ

Edited By:

Updated on: Mar 18, 2020 | 4:37 PM

కరోనా నివారణకు జరుగుతున్న కృషిలో తాను కూడా పాలుపంచుకుంటున్నానని ప్రకటించారు బాలీవుడ్ బాద్ షా బిగ్ బీ అమితాబ్ బచ్ఛన్. మహారాష్ట్రలో ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం కరోనా అనుమానితుల ఎడమ చేతికి ఓటరు ఇంక్ తో క్వారంటైన్ స్టాంప్ వేస్తున్న నేపథ్యంలో తను కూడా ఈ ముద్ర వేయించుకున్నానన్నారు. మంగళవారం రాత్రి ఆయన తన ట్విటర్ లో తన చేతిపై ‘టీ-3473’ సంఖ్యతో కూడిన ముద్రను చూపారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం అనుమానం కలిగినా ఐసొలేషన్ వెళ్లాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలని అమితాబ్ సూచించారు. కోవిడ్-19 నివారణకు వెంటనే తీసుకోవలసిన  జాగ్రత్తలపై సోషల్ మీడియాలో బిగ్ బీ చురుకుగా ఉంటున్నారు. దీనిపై ఇటీవల ఓ కవితను కూడా రాశారు. ఈ వ్యాధి వ్యాప్తి కాకుండా చూసేందుకు అమితాబ్ ప్రతి ఆదివారం తన అభిమానులతో జరిపే సమావేశాలను కూడా రద్దు చేసుకున్నారు.