Actor Katrina Kaif: బాలీవుడ్‌ను వెంటాడుతున్న కరోనా రక్కసి.. కత్రినా కైఫ్‌కు పాజిటివ్..

క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో కోర‌లు చాస్తుంది. సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది. గతేడాది ఇదే సమయంలో కరోనా వ్యాప్తి మొదలవగా.. ఇప్పుడు మళ్లీ ఇదే సమయంలో విజృంభిస్తోంది చేందుతోంది. అయితే, తాజాగా కరోనా..

Actor Katrina Kaif: బాలీవుడ్‌ను వెంటాడుతున్న కరోనా రక్కసి.. కత్రినా కైఫ్‌కు పాజిటివ్..
Actor Katrina Kaif Tests Po

Edited By:

Updated on: Apr 06, 2021 | 5:33 PM

Corona Second Wave: క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో కోర‌లు చాస్తుంది. సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది. గతేడాది ఇదే సమయంలో కరోనా వ్యాప్తి మొదలవగా.. ఇప్పుడు మళ్లీ ఇదే సమయంలో విజృంభిస్తోంది చేందుతోంది. అయితే, తాజాగా కరోనా మహమ్మారి చిత్ర రంగాన్ని కుదిపేస్తోంది. బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ కూడా కరోనా బారిన పడ్డారు. కత్రినాకు కరోనా పాజిటివ్ అని వైద్యులు తేల్చారు. ఈ విషయాన్ని స్వయంగా కత్రినా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఇవాళ ఉదయం నాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. వైద్యులు నాకు పాజిటివ్‌గా ధృవీకరించారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం.. సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ అయ్యాను. వైద్యుల సూచనలు పాటిస్తూ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోండి. వైద్యుల సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకోండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తాను.’’ అంటూ కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా,  త్వరగా కత్రినా కైఫ్ కోలుకోవాలని ఫ్యాన్స్, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

ఇదిలాఉంటే. టాప్ స్టార్స్ అంతా వరుసగా కరోనా బారిన పడుతుండటంతో బాలీవుడ్‌లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే..అక్షయ్ కుమార్, ఆమీర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, మలైకా అరోరా, ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ, మనోజ్ బాజ్‌పాయ్‌, దంగల్ నటి పాతిమా సనా షేక్ వంటి వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో బీటౌన్‌లో కంగారు మొదలైంది.

Loading...
Unable to load recommendations.
Follow Us