అన్నీ లైట్… మద్యమే హైలెట్..! దుకాణాల ముందు పూజలతో …

|

May 04, 2020 | 11:17 AM

దాదాపు నెలన్నర రోజుల లాక్ డౌన్ కారణంగా మందుబాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. చుక్క పడితేనే కునుకు పట్టని వాళ్లు మందు దొరక్క నానా తంటాలు పడ్డారు. ఇక మద్యం తాగక పిచ్చిగా ప్రవర్తించిన వాళ్లు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా.. లిక్కర్ షాపులు ఎప్పుడు తెరుస్తారా అని మందుబాబులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇక వారికి ఊరటను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి గ్రీన్, […]

అన్నీ లైట్... మద్యమే హైలెట్..! దుకాణాల ముందు పూజలతో ...
Follow us on

దాదాపు నెలన్నర రోజుల లాక్ డౌన్ కారణంగా మందుబాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. చుక్క పడితేనే కునుకు పట్టని వాళ్లు మందు దొరక్క నానా తంటాలు పడ్డారు. ఇక మద్యం తాగక పిచ్చిగా ప్రవర్తించిన వాళ్లు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా.. లిక్కర్ షాపులు ఎప్పుడు తెరుస్తారా అని మందుబాబులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇక వారికి ఊరటను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చునని ప్రకటించింది.

దీనితో మద్యం ప్రియుల ఆనందానికి అవధులు లేవు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని కోలూర్ జిల్లాలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కోలూరు బంగారుపేటలోని ఒక మద్యం షాపుకు ఓ మందుబాబు ఏకంగా పూజలు నిర్వహించాడు. కొబ్బరికాయ కొట్టి హరతులిచ్చాడు. ఇక ఈ తతంగం మొత్తం చూసిన జనం విస్తుబోయారు. వైన్ షాపులు తెరచుకుంటుండటంతో మందుబాబుల ఎంతగా ఆనందపడుతున్నారో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. కాగా, మద్యం దుకాణాలను శానిటైజ్ చేసి బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మాస్క్ ధరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ విక్రయాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.

Read More: 

తెలంగాణలో మే 21 వరకు లాక్‌డౌన్‌..?

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..

నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..

వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0.. తెరుచుకునేవి ఇవే..

‘కరోనా’ జంతువును మన దేశంలోనూ తింటారట.. ఎక్కడో తెలుసా.!

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. దేశంలో కరోనా కేసులు ఎన్నంటే…