పెరుగుతున్న కేసులు.. 9వేల మార్క్‌ దిశగా రాజస్థాన్‌

| Edited By:

May 31, 2020 | 3:25 PM

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా ఎనభై వేలు దాటింది. ఇక వీరిలో ఐదు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో తోంభైవేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో డెబ్బై వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా రాజస్థాన్‌లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది […]

పెరుగుతున్న కేసులు.. 9వేల మార్క్‌ దిశగా రాజస్థాన్‌
Covid-19
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా ఎనభై వేలు దాటింది. ఇక వీరిలో ఐదు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో తోంభైవేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో డెబ్బై వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

తాజాగా రాజస్థాన్‌లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది వేలు దాటి.. తొమ్మిది వేలకు చేరువలో ఉంది. ఆదివారం నాడు.. కొత్తగా మరో 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,693కి చేరింది. ఇక తాజాగా కరోనా బారినపడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 194కి చేరింది. ఇక ఆదివారం నాడు.. కరోనా బారినుంచి కోలుకొని 20 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5,772కి చేరింది. అయితే వీరిలో 5,099 మంది డిశ్జార్జ్ కాగా.. మిగతా వారు పర్యవేక్షణలో ఉన్నారు. ఇక రాష్ట్రంలో జైపూర్‌లో అత్యధికంగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ మొత్తం 1,982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.