హిమాచల్‌లో రెచ్చిపోతున్న కరోనా మహమ్మారి

| Edited By:

May 28, 2020 | 4:45 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది. మొన్నటి వరకు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యల్పంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా.. ఆ రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. స్థానిక ప్రజలు భయపడుతున్నారు. గురువారం కరోనా బారినపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా […]

హిమాచల్‌లో రెచ్చిపోతున్న కరోనా మహమ్మారి
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది. మొన్నటి వరకు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యల్పంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా.. ఆ రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. స్థానిక ప్రజలు భయపడుతున్నారు. గురువారం కరోనా బారినపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 276కి చేరింది. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

బుధవారం జరిపిన 560 పరీక్షల్లో మూడు పాజిటివ్ తేలగా.. 112 నెగిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరో 431 మంది రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం 201 యాక్టివ్ కేసులు ఉండగా.. 66 మంది కరోనా బారినుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా హమీర్పూర్ జిల్లాలో
86 నమోదుకాగా.. కంగ్రా జిల్లాలో 46, బిలాస్‌పూర్‌లో 14 కేసులు నమోదయ్యాయి.