
కరోనా మహమ్మారి దేశంలో విలయ తాండవం చేస్తోంది. రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,04,641కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,26,947 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 3,59,860 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 434 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 17,834కి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా, దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పలు రాష్ట్రాల్లోని కంటైన్మెంట్ జోన్‌లలో కఠినంగా లాక్‌డౌన్ విధిస్తున్నారు.