ఊపిరి పీల్చుకుంటున్న అసోం.. రీజన్ ఇదే..

| Edited By:

Jun 02, 2020 | 8:32 PM

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం కరోన కేసులు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుఉతున్నాయి. తాజాగా అసోంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే మంగళవారం కరోనా విషయంలో అక్కడి ప్రజలు ఊపిరి తీల్చుకునే విషయం తెలిపింది సర్కార్. తాజాగా మంగళవారం నాడు కరోనా బారినుంచి 40 మంది కోలుకున్నారని పేర్కొంది. ఈ విషయాన్ని అసోం […]

ఊపిరి పీల్చుకుంటున్న అసోం.. రీజన్ ఇదే..
Follow us on

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం కరోన కేసులు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుఉతున్నాయి. తాజాగా అసోంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే మంగళవారం కరోనా విషయంలో అక్కడి ప్రజలు ఊపిరి తీల్చుకునే విషయం తెలిపింది సర్కార్. తాజాగా మంగళవారం నాడు కరోనా బారినుంచి 40 మంది కోలుకున్నారని పేర్కొంది. ఈ విషయాన్ని అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత్ బిస్వ శర్మ తెలిపారు. ఈ 40 మందిలో 12 మంది డీఎచ్ గోలాఘట్‌ నుంచి, 18 మంది సిల్చార్‌ మెడికల్ కాలేజీ ఆస్పత్రి నుంచి, 9 మంది మహేంద్ర మోహన్ చౌదరి ఆస్పత్రి నుంచి ఇక మరొకరు డీఎచ్ దేమజీ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,513 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. వీటిలో ప్రస్తుతం 1,182 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 324 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.