ఒడిషాలో 7వేలు దాటిన కరోనా కేసులు

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్ ‌1.0 ప్రారంభం నుంచి కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా..

ఒడిషాలో 7వేలు దాటిన కరోనా కేసులు

Updated on: Jun 30, 2020 | 4:27 PM

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్ ‌1.0 ప్రారంభం నుంచి కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 206 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడువేల మార్క్‌ను దాటింది.ఈ విషయాన్ని ఒడిషా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2వేల యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. దాదాపు ఐదు వేల మంది వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి ఇరవై ఐదు మంది మరణించారని అధికారులు వెల్లడించారు.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. వారినికి లక్ష కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5.66 లక్షలకు
చేరుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us