ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న కరోనా..!

| Edited By:

May 07, 2020 | 10:11 PM

ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. కులం, మతం, ప్రదేశం, దేశం ఎదైనా సరే.. ఐ డోంట్ కేర్ అంటూ అందర్నీ కాటేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ముప్పై ఏడు లక్షల మంది దీని బారినపడ్డారు. వీరిలో పన్నెండు లక్షల మంది కోలుకోగా.. మరో రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మన దేశంలో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది. తాజాగా దీని బారనపడి ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. […]

ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న కరోనా..!
Follow us on

ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. కులం, మతం, ప్రదేశం, దేశం ఎదైనా సరే.. ఐ డోంట్ కేర్ అంటూ అందర్నీ కాటేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ముప్పై ఏడు లక్షల మంది దీని బారినపడ్డారు. వీరిలో పన్నెండు లక్షల మంది కోలుకోగా.. మరో రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మన దేశంలో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది. తాజాగా దీని బారనపడి ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. మరో 41 మంది జవాన్లను కాటేసింది. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తాజాగా 41 మంది జవాన్లతో కలిపి ఇప్పటి వరకు కరోనా బారినపడ్డ బీఎస్ఎఫ్ జవాన్ల సంఖ్య 193కు పెరిగింది. వీరిలో ఇప్పటి వరకు కేవలం ఇద్దరు జవాన్లు మాత్రమే కోలుకున్నారని.. మరో ఇద్దరు ప్రాణాలు విడిచారని తెలిపారు. కాగా.. అటు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా కరోనా బారినపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారిలో కూడా ఓ 55 ఏళ్ల ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారి కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.