ఆర్ధిక రాజధానిపై కరోనా పంజా.. బుధవారం ఒక్కరోజే..

| Edited By:

Apr 15, 2020 | 8:50 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే పదకొండు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అందులో ఎక్కువగా మహారాష్ట్ర నుంచే ఉన్నాయి. అందులో ముఖ్యంగా దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైలో దాదాపు రెండువేల వరకు కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో ముంబై నగర వాసులు కరోనా భయంతో వణికిపోతున్నారు. బుధవారం ఒక్కరోజే ముంబైలో కొత్తగా.. మరో 183 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు..కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందారు. దీంతో.. […]

ఆర్ధిక రాజధానిపై కరోనా పంజా.. బుధవారం ఒక్కరోజే..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే పదకొండు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అందులో ఎక్కువగా మహారాష్ట్ర నుంచే ఉన్నాయి. అందులో ముఖ్యంగా దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైలో దాదాపు రెండువేల వరకు కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో ముంబై నగర వాసులు కరోనా భయంతో వణికిపోతున్నారు. బుధవారం ఒక్కరోజే ముంబైలో కొత్తగా.. మరో 183 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు..కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందారు. దీంతో.. ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1936కు చేరగా..ఇప్పటివరకూ 113 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇక కరోనా నుంచి కోలుకొని 181 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇదిలా ఉంటే.. ముంబై నగరం మాత్రమే కాకుండా.. మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 2,801 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ముంబై తర్వాత.. పూణేలో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. బుధవారం ఒక్కరోజే.. కరోనా బారినపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పూణె నగరంలో కరోనా ఎఫెక్ట్‌తో చనిపోయిన వారి సంఖ్య 43కు చేరుకుంది.