31 వేల మార్క్‌ దాటిన తమిళనాడు కేసులు..

తమిళనాడులో ఆదివారం నాడు మరో 1,515 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 31,667కి చేరింది.

31 వేల మార్క్‌ దాటిన తమిళనాడు కేసులు..

Edited By:

Updated on: Jun 07, 2020 | 7:37 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే రెండున్నర లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు.. ఆరువేల మందికి పైగా మరణించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఆదివారం నాడు మరో 1,515 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 31,667కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 18 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 269 మంది మరణించారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా చెన్నైలోనే అవుతున్నాయి. ఇక్కడ 22 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.