15 మంది తబ్లీఘీ జమాత్ సభ్యులు జైలుకు.. రీజన్‌ ఏంటంటే..?

దేశంలో కరోనా మహమ్మారి ప్రబలేందుకు కారణమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో 15 మంది తబ్లీఘీ జమాత్‌ సభ్యులను జైలుకు పంపారు మధ్య ప్రదేశ్ పోలీసులు. వీరిలో 10 మంది బంగ్లాదేశీకి చెందిన తబ్లీఘీ జమాత్‌ సభ్యులు కాగా.. మరో ఇద్దరు కోల్‌కతాకు చెందిన వారిగా గుర్తించారు. ఇక మరో ముగ్గురు షియోపూర్‌ వాసులుగా గుర్తించారు. వీరందరినీ గతంలోనే క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. అయితే తాజాగా జరిపిన పరీక్షల్లో ఈ 15మంది తబ్లీగ్ జమాత్ సభ్యులకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ […]

15 మంది తబ్లీఘీ జమాత్ సభ్యులు జైలుకు.. రీజన్‌ ఏంటంటే..?

Edited By:

Updated on: Apr 29, 2020 | 4:41 PM

దేశంలో కరోనా మహమ్మారి ప్రబలేందుకు కారణమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో 15 మంది తబ్లీఘీ జమాత్‌ సభ్యులను జైలుకు పంపారు మధ్య ప్రదేశ్ పోలీసులు. వీరిలో 10 మంది బంగ్లాదేశీకి చెందిన తబ్లీఘీ జమాత్‌ సభ్యులు కాగా.. మరో ఇద్దరు కోల్‌కతాకు చెందిన వారిగా గుర్తించారు. ఇక మరో ముగ్గురు షియోపూర్‌ వాసులుగా గుర్తించారు. వీరందరినీ గతంలోనే క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. అయితే తాజాగా జరిపిన పరీక్షల్లో ఈ 15మంది తబ్లీగ్ జమాత్ సభ్యులకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని తేలడంతో వారిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు షియోపూర్ జిల్లా ఎస్పీ సంపత్ ఉపాధ్యాయ్ వెల్లడించారు.

కాగా.. మధ్యప్రదేశ్‌లో మొత్తం 2,368 మందికి కరోనా సోకగా.. 113 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఇండోర్‌, భోపాల్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదువుతున్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి తబ్లీఘీ జమాత్‌ సభ్యుల కాంటాక్ట్‌ కేసులేనన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 15 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.