మహా పోలీసులకు కరోనా టెన్షన్‌.. తాజాగా మరో 138 మంది సిబ్బందికి..

| Edited By:

Jul 28, 2020 | 4:21 PM

మహారాష్ట్రలో కరోనా మహామ్మారి విజృంభిస్తోంది. సామాన్య ప్రజలను మొదలుకొని.. ప్రజా ప్రతినిధుల వరకు అందర్నీ వణికిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్రలో..

మహా పోలీసులకు కరోనా టెన్షన్‌.. తాజాగా మరో 138 మంది సిబ్బందికి..
Follow us on

మహారాష్ట్రలో కరోనా మహామ్మారి విజృంభిస్తోంది. సామాన్య ప్రజలను మొదలుకొని.. ప్రజా ప్రతినిధుల వరకు అందర్నీ వణికిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్రలో ఫ్రంట్‌ వారియర్స్‌గా ఉన్న పోలీసులను టెన్షన్‌కు గురిచేస్తోంది. ఇప్పటికే దాదాపు ఎనిమిది వేల మంది పోలీస్ సిబ్బందికి పైగా కరోనా పాజిటివ్ సోకింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 138 పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడ్డ పోలీసు సిబ్బంది సంఖ్య 8,722కి చేరింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 6,670 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,955 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 97 మంది పోలీస్ సిబ్బంది మరణించారు.

కాగా, దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ముంబై నగరంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3.83 లక్షల మందికి కరోనా సోకగా.. అందులో 2.21 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1.47 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.