కమ్మేస్తున్న కరోనా.. దేశంలో లక్షా 50 వేలు దాటిన కేసులు..

దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 6,387 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు వైరస్ కారణంగా 170 మరణాలు సంభవించాయి. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,51,767కి చేరింది. వీరిలో యాక్టివ్ కేసులు 83,004 కాగా, 64,426 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మహమ్మారి వల్ల దేశంలో 4,337 మంది ప్రాణాలు విడిచారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. […]

కమ్మేస్తున్న కరోనా.. దేశంలో లక్షా 50 వేలు దాటిన కేసులు..
Follow us

|

Updated on: May 27, 2020 | 11:04 AM

దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 6,387 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు వైరస్ కారణంగా 170 మరణాలు సంభవించాయి. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,51,767కి చేరింది. వీరిలో యాక్టివ్ కేసులు 83,004 కాగా, 64,426 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కరోనా మహమ్మారి వల్ల దేశంలో 4,337 మంది ప్రాణాలు విడిచారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, నిన్న ఒక్క రోజే దాదాపు 4 వేల మంది డిశ్చార్జ్ కావడంతో ఇండియాలో రికవరీ రేట్ క్రమేపి పెరుగుతోందని చెప్పాలి. మరోవైపు మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 2091 పాజిటివ్ కేసులు, 97 మరణాలు సంభవించాయి. దీనితో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 54, 758కి చేరింది. ఇప్పటివరకు 1792 మంది మృత్యువాతపడ్డారు. అటు తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.