స్టార్ హీరోలతో లవ్ ట్రాక్స్.. అంతమందిని ప్రేమించి చివరకు..

Rajeev 

10 May 2024

 ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది ముద్దుగుమ్మ మనీషా కోయిరాల.

తాజాగా సంజయ్ లీలా బన్సాలీ 'హిరామండి' వెబ్ సిరీస్‌లోని 'మల్లికా జాన్' అనే పాత్రలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇటీవలే విడుదలైన ఈ సిరీస్ లో మనీషా కోయిరాలా తన గ్లామర్ తో పాటు నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది.

మనీషా కొయిరాలా తన 33 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 70 కు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

మనీషా హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, నేపాలీ, ఆంగ్ల చిత్రాలలో నటించింది.

సౌత్ నార్త్ లో ఉన్న దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీఫుల్ లేడీ.

నటులు వివేక్ ముష్రాన్, నానా పటేకర్, డిజే హుస్సేన్, నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్, ప్రశాంత్ చౌదరి, ఆస్ట్రేలియన్ అంబాసిడర్ క్రిస్పిన్ కాన్రాయ్‌లతో మనీషా రిలేషన్ షిప్ లో ఉందని అప్పట్లో రూమర్లు వచ్చాయి.

వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ని పెళ్లి చేసుకుంది కానీ ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటుంది.