కరోనా ఎఫెక్ట్: కశ్మీర్‌లో 42 వేల చెట్లు నరికివేత

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో వేల చెట్లను నరికేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. దాదాపు 42 వేళ ఆడ 'పోప్లార' చెట్లను నరికేయాలని గత వారం స్థానిక యంత్రాంగం.. సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. రైతులు, ప్రైవేట్ ల్యాండ్ ఓనర్లు కూడా ఆడ పోప్లార్..

కరోనా ఎఫెక్ట్: కశ్మీర్‌లో 42 వేల చెట్లు నరికివేత
Follow us

| Edited By:

Updated on: Apr 14, 2020 | 9:21 AM

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో వేల చెట్లను నరికేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. దాదాపు 42 వేళ ఆడ ‘పోప్లార’ చెట్లను నరికేయాలని గత వారం స్థానిక యంత్రాంగం.. సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. రైతులు, ప్రైవేట్ ల్యాండ్ ఓనర్లు కూడా ఆడ పోప్లార్ చెట్లను నరికేసేలా చూడాలని జిల్లా అధికారులను కోరారు. రుస్సీ ఫ్రాస్‌గా పిలువబడే పోప్లార్ చెట్లు పత్తి రూపంలో ఉండే పుప్పొడి లేదా బీజ రేణువులను విడుదల చేస్తాయి. దీంతో కొంత మందిలో శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తలెత్తాయి. అవి విడుదల చేసే బీజ రేణువులు వల్ల కరోనా మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాద ముదని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వాటిని నరికివేయాలని అధికారులు భావించారు. అయితే కరోనా వ్యాప్తి, చెట్ల నుంచి విడుదలయ్యే బీజ రేణువులు కారణమని ఏ ఆధారం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

దాదాపు కశ్మీర్‌లో 2 కోట్ల పోప్లార్ చెట్లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిని ‘నార్త్‌ అమెరికన్ కాటన్ ట్రీ’ అని కూడా పిలుస్తారు. అలాగే ఈ చెట్ల నరికివేతపై విమర్శలు కూడా వినబడుతున్నాయి. చెట్లను అనవసరంగా నరికివేస్తే పర్యావరణ విపత్తుకు దారితీస్తుందని.. పక్షులు, జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా 2014లో కూడా స్థానిక కోర్టు ఆదేశాల మేరకు కశ్మీర్ ప్రభుత్వం 26 వేల పోప్లార్ చెట్లను నరికివేసింది.

ఇవి కూడా చదవండి:

21 రోజుల లాక్‌డౌన్ దెబ్బకి.. రూ.8 లక్షల కోట్ల నష్టం

జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో విడుదల కాని ఫస్ట్ సినిమా ఇదే..!

రిలయన్స్ శాస్త్రవేత్తల పరిశోధన.. సముద్ర నాచుతో కరోనాకి చెక్?

లాక్‌డౌన్-2.0కు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోన్న కేంద్రం