ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు: పృథ్వీ హాట్ కామెంట్స్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అత్యవసర సమావేశం గందరగోళంగా మారింది. మా అధ్యక్షుడు నరేష్‌ పనితీరుపై ఈసీ మెంబర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరేశ్‌ను కాదని, జనరల్‌ మీటింగ్‌కు హాజరుకావాలని, ఈసీ సభ్యులకు జీవిత-రాజశేఖర్‌ సందేశాలు పంపడం తాజా దుమారానికి కారణమైంది. పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ తనకు ఈసీ మెంబర్ పదవి అక్కర్లేదని, రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. 400 సినిమాలకు […]

ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు: పృథ్వీ హాట్ కామెంట్స్!
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2019 | 5:04 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అత్యవసర సమావేశం గందరగోళంగా మారింది. మా అధ్యక్షుడు నరేష్‌ పనితీరుపై ఈసీ మెంబర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరేశ్‌ను కాదని, జనరల్‌ మీటింగ్‌కు హాజరుకావాలని, ఈసీ సభ్యులకు జీవిత-రాజశేఖర్‌ సందేశాలు పంపడం తాజా దుమారానికి కారణమైంది. పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ తనకు ఈసీ మెంబర్ పదవి అక్కర్లేదని, రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరి గోపాలకృష్ణకు అవమానం జరిగిందని, పరుచూరి కంటతడి పెడుతూ వెళ్లిపోయారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్‌లో కొందరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఫీలవుతున్నారని, ఎవరికి వారు గ్రూపులు పెట్టుకున్నారని పృథ్వీ ఆరోపించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడిగా గెలిచినందుకు ఆనందపడాలో.. ‘మా’లో ఇలా జరుగుతున్నందుకు బాధపడాలో తెలియడం లేదన్నారు. సభ్యులు ఏం మాట్లాడినా.. జీవిత రాజశేఖర్ తప్పుపడుతున్నారని చెప్పారు. చిరంజీవి, కృష్ణంరాజు ఈ సమస్యను పరిష్కరించలని కోరారు. సినీ పెద్దలు జోక్యం చేసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని పృథ్వీ అభిప్రాయపడ్డారు.