Breaking News
  • మద్యం ఎక్కువ వినియోగం ఉన్న ప్రాంతాల్లో.. మద్యం షాపులను తగ్గించలేదు-అచ్చెన్నాయుడు. సేల్స్ లేని చోట మాత్రమే షాపులు తగ్గించారు-అచ్చెన్నాయుడు.
  • ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.
  • గుంటూరు: మైనర్‌ బాలికపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. అసెంబ్లీలో దిశ బిల్లు పెట్టిన రోజే ఘటన జరగడం దారుణం-చంద్రబాబు దిశ చట్టం తెచ్చారు.. 21 రోజుల్లో ఉరి అన్నారు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు దిశ విషయంలో చూపిన శ్రద్ధ.. మైనర్‌ బాలికపై ఎందుకు చూపడంలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బాధిత కుటుంబానికి టీడీపీ తరపున రూ.50 వేల ఆర్థికసాయం-చంద్రబాబు.
  • ఆర్టీసీ విలీనంపై టైమ్‌బాండ్‌ పెట్టి కమిటీని నియమించాం-పేర్ని నాని. కమిటీ నివేదిక వచ్చాక ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కొత్త చట్టం తెస్తున్నాం. 200 రోజుల్లోనే జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు-పేర్ని నాని. ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. జనవరి 1లోగా ప్రజా రవాణాశాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం-పేర్ని నాని.
  • రేపు యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన.
  • జులై 1వ తేదీ నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ నివేదిక. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం మద్యం షాపులు తగ్గించాం. ప్రస్తుతం 3,456 షాపులకు కుదించాం-సీఎం జగన్‌. 43 వేల బెల్ట్‌ షాపులను ఎత్తివేశాం-సీఎం జగన్‌. ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. సభను తప్పుదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు. అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నా-జగన్‌. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.

రోజు లవంగాలు తింటే ఎన్ని ప్రయోజనాలో..!

Health benefits and uses of Cloves, రోజు లవంగాలు తింటే ఎన్ని ప్రయోజనాలో..!

సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. దీనిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి లేని పోపుల డబ్బా ఉండనే ఉండదు. అటు మసాలా కూరలతో పాటుగా, మాంసాహార కూరల్లో, బిర్యానీ తయారీలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు దీనిని నార్మల్‌గా కూడా తింటారు. ఎందుకంటే లవంగాలు వంటల్లో రుచినే కాదు. .ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. లవంగాల్ని కూరలతోపాటూ… కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా ఎక్కువగా వాడతారు. అయితే ఈ లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో చూద్దాం.

Health benefits and uses of Cloves, రోజు లవంగాలు తింటే ఎన్ని ప్రయోజనాలో..!

లవంగాల వల్ల కలిగే ప్రయోజనాలు…

* లవంగాలను తినడం వల్ల మన పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.
* దంత సమస్యలు, చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు లవంగాలను పొడిగా చేసి ఉపయోగిస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
* నోటి నుంచి ఎక్కువగా దుర్వాసన వస్తే.. రెండు మూడు లవంగాలు నమిలితే చాలు.. ఆ దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు
* కొందరికి దూర ప్రయాణాలు చేయడం పడదు. ప్రయాణాల్లో మధ్యలోనే వాంతులు చేసుకుంటుంటారు. అలాంటి వారి సమస్యను కూడా లవంగాలతో చెక్ పెట్టొచ్చు. ప్రయాణానికి ముందు ఓ రెండు లవంగాలు తీసుకుంటే సరి. తిన్న ఆహారం జీర్ణం అవ్వడంతో పాటుగా.. వికారం లాంటివి పోతాయి. దీంతో ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
* ఇక వర్షంలో తడిసినా.. చల్లని పదార్థాలు, స్వీట్లు తీసుకున్నా.. చాలా మందికి వెంటనే జలుబు, దగ్గు పట్టేస్తుంది. అయితే ఇలాంటి సమయంలో రోజులో ఓ అయిదు లవంగాలను తీసుకుంటే.. త్వరగా ఉపశమనం కలుగుతుంది.

Health benefits and uses of Cloves, రోజు లవంగాలు తింటే ఎన్ని ప్రయోజనాలో..!
* అంతేకాదు.. ఇవి వ్యాధుల్ని నియంత్రిచడంలో కూడా పనిచేస్తాయి. శరీరంలోని విష పదార్థాల్ని బయటకు పంపడంలో ఇవి బాగా పనిచేస్తాయి.
* రెగ్యులర్‌గా తలనొప్పి వచ్చేవారు.. లవంగాలను తినడం ద్వారా తలనొప్పిని నుంచి బయటపడతారు. అంతేకాదు ఇది బీపీని, షుగర్‌ లెవల్స్‌ను కూడా కంట్రోల్‌‌లో ఉంచుతాయి.
* లివర్, స్కిన్ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు
* లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. దీని ద్వారా నొప్పి, వాపు, మంటల్ని తగ్గిస్తుంది.
* అల్సర్ సమస్యలకు కూడా లవంగాలతో ఉపశమనం పొందవచ్చు.

అయితే నియమితంగా కాకుండా.. అదే పనిగా వీటిని తింటే ఇబ్బందులు తప్పవు. ఎక్కువగా తింటే నోరు పాడయ్యే అవకాశం ఉంది. రోజుకు నాలుగైదు కంటే మించకుండా తీసుకోవాలి. పిల్లలకు వీలైనంత తక్కువగా ఇస్తే అంత మంచిది. లవంగాలు మంచివి కదా అని అతిగా వాడితే.. సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల నియమితంగా తీసుకుంటే ఏ సమస్య దరిచేరదు.