కిమ్‌ కోసం చైనా నుంచి ప్రత్యేక టీమ్.. అసలు ఏం జరుగుతోంది..!

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ ఆరోగ్య వార్తలపై పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. కిమ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందా..? లేదా విషమంగా ఉందా..? అసలు కిమ్‌కు ఏమైంది?

కిమ్‌ కోసం చైనా నుంచి ప్రత్యేక టీమ్.. అసలు ఏం జరుగుతోంది..!
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2020 | 9:37 AM

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ ఆరోగ్య వార్తలపై పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. కిమ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందా..? లేదా విషమంగా ఉందా..? అసలు కిమ్‌కు ఏమైంది? అనే ప్రశ్నలు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి. తమ అధ్యక్షుడు బాగానే ఉన్నాడంటూ అక్కడి మీడియా ప్రకటించినప్పటికీ.. కిమ్‌ బయటకు రాకపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కిమ్ కోసం ఉత్తరకొరియా సన్నిహిత దేశం చైనా వైద్య నిపుణుల టీమ్‌ని ఆ దేశానికి పంపిందని.. రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది.

ఉత్తర కొరియాకు చైనా పంపిన టీమ్ ఏం చేస్తుంది..? వారు ఎందుకు ఉత్తర కొరియాకు వెళ్లారు..? ఆ టీమ్‌లో వైద్య నిపుణులు ఎందుకు ఉన్నారు..? అన్న విషయాలేవీ తెలియలేదని రాయిటర్స్ పేర్కొంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఇంటర్నేషనల్ లైసన్ డిపార్ట్‌మెంట్‌కి సీనియర్ సభ్యుడి సారధ్యంలో ఈ టీమ్ గురువారం ఉత్తరకొరియా వెళ్లినట్లు సమాచారం. ఇక ఈ విషయంపై రాయిటర్స్ ఇంటర్నేషనల్‌ లైసన్‌ డిపార్ట్‌మెంట్‌ను ప్రశ్నించగా… వారు ఏ సమాధానమూ చెప్పకుండా సైలెంట్ అయిపోయినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కిమ్‌ గురించి శుక్రవారం సౌత్ కొరియా నిఘావర్గాలు స్పందిస్తూ… త్వరలోనే కిమ్ పూర్తి ఆరోగ్యంతో ప్రజలకు కనిపిస్తారని తమతో చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.

Read This Story Also: దేశవ్యాప్తంగా 24వేలు దాటేసిన పాజిటివ్ కేసులు.. మొత్తం ఎన్నంటే..!

Latest Articles
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి