ఇప్పటి వరకు13వేల మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశామన్న డ్రాగన్

బీజీంగ్ : గ‌డిచిన ఐదేళ్లలో సుమారు పదమూడు వేలమంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు చైనా వెల్లడించింది. చైనాలోని జింగ్ఇయాంగ్ రాష్ట్రంలో తీవ్రంగా ఉగ్రకార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో 2014 నుంచి ఆ ప్రాంతంలో చైనా కఠిన చర్యలకు దిగింది. అయితే ఆ ప్రాంతంలో ఇస్లామిక్ ఆధిప‌త్యం ఎక్కువగా ఉంది. జింగ్ఇయాంగ్ ప్రాంతంలో ఉగుర్‌, ముస్లిం తెగ‌లల‌కు చెందిన‌ సుమారు ప‌ది ల‌క్షల మంది ఉన్నారు. ఉగ్రవాదుల ఏరివేత‌లో భాగంగా.. ట్రైనింగ్ సెంట‌ర్లను టార్గెట్ చేసిన‌ట్లు చైనా వెల్లడించింది. అయితే […]

ఇప్పటి వరకు13వేల మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశామన్న డ్రాగన్
Follow us

| Edited By:

Updated on: Mar 18, 2019 | 3:03 PM

బీజీంగ్ : గ‌డిచిన ఐదేళ్లలో సుమారు పదమూడు వేలమంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు చైనా వెల్లడించింది. చైనాలోని జింగ్ఇయాంగ్ రాష్ట్రంలో తీవ్రంగా ఉగ్రకార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో 2014 నుంచి ఆ ప్రాంతంలో చైనా కఠిన చర్యలకు దిగింది. అయితే ఆ ప్రాంతంలో ఇస్లామిక్ ఆధిప‌త్యం ఎక్కువగా ఉంది. జింగ్ఇయాంగ్ ప్రాంతంలో ఉగుర్‌, ముస్లిం తెగ‌లల‌కు చెందిన‌ సుమారు ప‌ది ల‌క్షల మంది ఉన్నారు. ఉగ్రవాదుల ఏరివేత‌లో భాగంగా.. ట్రైనింగ్ సెంట‌ర్లను టార్గెట్ చేసిన‌ట్లు చైనా వెల్లడించింది. అయితే పట్టుబ‌డ్డ ఉగ్రవాదుల్లో అధికంగా ముస్లిం వారే అధికంగా ఉన్నారని.. వారంతా క‌మ్యూనిస్టు భావాల‌కు క‌ట్టుబ‌డి ఉండేవిధంగా చ‌ర్యలు చేప‌ట్టామ‌ని చైనా చెప్పింది. తాము చేప‌ట్టిన చ‌ర్యల‌తో మ‌త తీవ్రవాదం త‌క్కువైంద‌ని చైనా ఇవాళ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్నది.