పాడి రైతులకు గుడ్‌న్యూస్.. కిలో ఆవు పేడకి రూ.2 చెల్లింపు..!

పాడి రైతులకు ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారు పెంచుకుంటున్న ఆవుల ద్వారా వచ్చే పేడను కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక నుంచి కిలో ఆవు పేడకి రూ.2/- చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం..

పాడి రైతులకు గుడ్‌న్యూస్.. కిలో ఆవు పేడకి రూ.2 చెల్లింపు..!
Follow us

| Edited By:

Updated on: Jul 21, 2020 | 8:20 PM

పాడి రైతులకు ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారు పెంచుకుంటున్న ఆవుల ద్వారా వచ్చే పేడను కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక నుంచి కిలో ఆవు పేడకి రూ.2/- చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇక నుంచి రైతులు, గోశాలల నుంచి ఆవు పేడను కొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం భూపేశ్‌ భగేల్..‘గోధన్‌ న్యాయ్‌ యోజన్‌’స్కీమ్‌ను సోమవారం నాడు ప్రారంభించారు. రైతులు, గో శాలల నుంచి సేకరించిన ఆవు పేడను సహకార సంఘాల ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దానిని రైతన్నలకు ఏరువుగా అందించనున్నారు. ఇలా చేయడం ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని.. అంతేకాకుండా.. అదే సమయంలో రైతులు కూడా లాభాలు పొందుతారని ప్రభుత్వం భావిస్తోంది.