చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-2.. సక్సెస్‌ఫుల్ మిషన్

చంద్రయాన్-2 ప్రయాణంలో మరో ‘ మజిలీ ‘..ప్రయోగించిన దాదాపు 30 రోజుల తరువాత చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుని కక్ష్యలోకి చేరింది. (గత జులై 22న ఈ ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే). ఇస్రో బృందం మంగళవారం ఉదయం 9. 0 2 గంటలకు ఈ ఆపరేషన్ ప్రారంభించి 1738 సెకండ్ల పాటు కొనసాగించింది. ‘ మేక్ ఆర్ బ్రేక్ ‘ అంటూ పేర్కొన్న ప్రయాణాన్ని వారు ఖఛ్చితంగా పూర్తి చేయగలిగారు. చంద్రయాన్ ను జాబిల్లికి మరింత దగ్గరగా […]

చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-2.. సక్సెస్‌ఫుల్ మిషన్
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2019 | 11:32 AM

చంద్రయాన్-2 ప్రయాణంలో మరో ‘ మజిలీ ‘..ప్రయోగించిన దాదాపు 30 రోజుల తరువాత చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుని కక్ష్యలోకి చేరింది. (గత జులై 22న ఈ ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే). ఇస్రో బృందం మంగళవారం ఉదయం 9. 0 2 గంటలకు ఈ ఆపరేషన్ ప్రారంభించి 1738 సెకండ్ల పాటు కొనసాగించింది. ‘ మేక్ ఆర్ బ్రేక్ ‘ అంటూ పేర్కొన్న ప్రయాణాన్ని వారు ఖఛ్చితంగా పూర్తి చేయగలిగారు. చంద్రయాన్ ను జాబిల్లికి మరింత దగ్గరగా చేరువ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఓ వైపు ఓరియంటేషన్ ప్రక్రియ తగ్గిస్తూ.. మరోవైపు చంద్రయాన్-2 వేగాన్ని తగ్గించి దాని దశ, దిశ మార్చడంతో ఉపగ్రహం చంద్రుడికి 114 కి.మీ. +18072కి.మీ. కక్ష్యలోకి చొచ్ఛుకుపోయింది. వ్యోమనౌకలోని లిక్విడ్ ఇంజన్ ను మండించి ఈ ప్రక్రియను చేపట్టారు. ప్రస్తుతం కక్ష్యలో ఉన్న చంద్రయాన్-2 పై మరో నాలుగు విన్యాసాలు చేపట్టనున్నారు. ఈ నెల 21, 28, 30 తేదీలలో చేపట్టే ప్రయోగాల ద్వారా చంద్రయాన్-2 చంద్రునికి చేరువగా వెళ్లనుంది. వచ్ఛే నెల 7 న తెల్లవారుజామున 1. 30 గంటల నుంచి 2.30 గంటల మధ్య ఇది సాఫీగా సౌత్ పోల్ వద్ద దిగనుంది. ఆర్బిటర్, లాండర్ లో ఏర్పాటు చేసిన కెమెరాలు లాండింగ్ స్థలాన్ని పరిశీలించి అక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉంటే లాండ్ అయ్యేలా చూస్తారు. లాండర్ దిగిన అనంతరం అందులోని రోవర్ దాదాపు నాలుగు గంటల తరువాత బయటికి వఛ్చి తన పని ప్రారంభిస్తుంది. ఇది సెకనుకు అత్యంత వేగంతో ప్రయాణిస్తుంది. 14 రోజుల్లో 500 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడ సేకరించిన డేటాను లాండర్ ద్వారా 15 నిముషాల్లో భూమికి పంపుతుంది. కాగా ఈ మిషన్ లో రెండో ‘ మజిలీ ‘ విజయవంతం కావడంపట్ల ఇస్రో శాస్త్రజ్ఞులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.