కిలో ఉల్లి రూ.22కే ఇస్తామంటుంటే.. నో అంటున్నారట.. ఎందుకంటే..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉల్లికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో.. ఉల్లి పంటలు నీటమునిగాయి. చేతికి వచ్చిన పంట నీట మునగడంతో.. మార్కెట్లో ఉల్లి కొరత ఏర్పడింది. దీంతో సడన్‌గా కిలో వంద రూపాయల నుంచి ఏకంగా రెండు వందల వైపు పరుగెత్తింది. సామాన్య ప్రజలు ఉల్లి కొనలేని పరిస్థితి ఏర్పడటంతో.. ప్రభుత్వాలు ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు శ్రీకారం చుట్టాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్క తీరుగా సబ్సిడీ […]

కిలో ఉల్లి రూ.22కే ఇస్తామంటుంటే.. నో అంటున్నారట.. ఎందుకంటే..?
Follow us

| Edited By:

Updated on: Jan 16, 2020 | 11:21 AM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉల్లికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో.. ఉల్లి పంటలు నీటమునిగాయి. చేతికి వచ్చిన పంట నీట మునగడంతో.. మార్కెట్లో ఉల్లి కొరత ఏర్పడింది. దీంతో సడన్‌గా కిలో వంద రూపాయల నుంచి ఏకంగా రెండు వందల వైపు పరుగెత్తింది. సామాన్య ప్రజలు ఉల్లి కొనలేని పరిస్థితి ఏర్పడటంతో.. ప్రభుత్వాలు ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు శ్రీకారం చుట్టాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్క తీరుగా సబ్సిడీ ప్రకటించి.. ఉల్లికోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అయితే ఎంతకూ ఉల్లికి డిమాండ్ తగ్గకపోవడంతో.. కేంద్రం విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంది.

టర్కీ, అఫ్ఘానిస్థాన్‌, ఈజిప్టు తదితర దేశాల నుంచి 18వేల టన్నుల ఉల్లి వచ్చింది. అయితే ఇప్పటి వరకు 2 వేల టన్నులు మాత్రమే రాష్ట్రాలు కొనుగోలు చేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, ఉత్తరప్రదేశ్‌, వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రాలు దిగుమతి ఉల్లిని తీసుకోగా.. మిగతా రాష్ట్రాలు మాత్రం విదేశీ ఉల్లిని తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీనికి కారణం.. విదేశీ ఉల్లి ధర కిలో రూ.55 వరకు ఉండటం ఒకటైతే.. అదే ధరకు దేశీయ ఉల్లి కూడా లభిస్తుండటంతో విముఖత చూపాయి. అంతేగాక.. దిగుమతి చేసుకున్న ఉల్లి రుచీకరంగా ఉండదని.. కొనుగోలు చేసేందుకు స్థానికులు కూడా పెద్దగా ఆసక్తి చూపరనే కారణాలతో ఆయా రాష్ట్రాలు విముఖత చూపాయి. అయితే కేంద్రం ఆయా రాష్ట్రాలకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. రవాణా చార్జీలు కూడా తామే భరించి కిలో రూ.22కే ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అయినా కూడా వద్దంటూ ఆ ఉల్లికి దూరంగా ఉంటున్నాయి. దీంతో దిగుమతి చేసుకున్న ఉల్లిలో.. 90 శాతం కుళ్లిపోయే పరిస్థితి నెలకొంది.