America: అమెరికాలో భారతీయ విద్యార్థులకు పెద్దపీట.. రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు జారీ.. కారణమేంటంటే..

|

Sep 08, 2022 | 9:57 PM

భారతదేశంలోని (India) యూఎస్ మిషన్ - 2022 లో రికార్డు స్థాయిలో 82,000 స్టూడెంట్ వీసాలు జారీ చేసింది. ఇతర దేశాల కంటే ఇది ఎక్కువగా కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాలో చదువుతున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో..

America: అమెరికాలో భారతీయ విద్యార్థులకు పెద్దపీట.. రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు జారీ.. కారణమేంటంటే..
Visa
Follow us on

భారతదేశంలోని (India) యూఎస్ మిషన్ – 2022 లో రికార్డు స్థాయిలో 82,000 స్టూడెంట్ వీసాలు జారీ చేసింది. ఇతర దేశాల కంటే ఇది ఎక్కువగా కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాలో చదువుతున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 20 శాతం మంది ఇండియన్స్ ఉన్నారని అధికారిక ప్రకటనలో వెల్లడించింది. COVID-19 కారణంగా రెండేళ్లుగా వీసాల జారీలో తీవ్ర జాప్యం జరిగింది. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గిపోయింది. మునుపటి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చాలా మంది విద్య కోసం విదేశాలకు వెళ్తున్నారు. యూనివర్సిటీలు స్టూడెంట్స్ తో సందడిగా మారుతున్నాయి. ఈ క్రమంలో 82,000 స్టూడెంట్ వీసాలు జారీ చేసినట్లు యూస్ ఛార్జ్ డి అఫైర్స్ ప్యాట్రిసియా లాసినా చెప్పారు. న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయిలోని నాలుగు కాన్సులేట్‌లు మే నుంచి ఆగస్టు వరకు విద్యార్థి వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యతనిచ్చాయి. వీలైనన్ని ఎక్కువ మంది అర్హత కలిగిన విద్యార్థులు షెడ్యూల్ ప్రారంభానికి సమయానికి వారి అధ్యయన కార్యక్రమాలకు చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.

ఇండియాలో చాలా మంది ఉన్నత చదువుల కోసం అమెరికాను ఎంచుకుంటారు. యూఎస్ అయితే కెరీర్ పరంగా తమకు సురక్షితంగా ఉంటుందని భావిస్తుంటారు. భాగస్వామ్యాలు, ప్రస్తుత, భవిష్యత్తు ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి సమిష్టిగా పని చేస్తాయమని నిపుణులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో చదువుతున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 20 శాతం మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. 2021లో ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 2020-2021 విద్యా సంవత్సరంలో భారతదేశం నుంచి 1,67,582 మంది విద్యార్థులు ఉన్నారు.

COVID-19 మహమ్మారి వ్యాప్తి తగ్గిపోయిన తర్వాత యూఎస్ విదేశీ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. 2020లో US ప్రభుత్వం, US ఉన్నత-విద్యా సంస్థలు విదేశీ విద్యార్థులను వ్యక్తిగతంగా, ఆన్లైన్‌లో హైబ్రిడ్ అభ్యాస పద్ధతుల ద్వారా సురక్షితంగా స్వాగతించే చర్యలను అమలు చేశాయి. అంతర్జాతీయ విద్యార్థులకు అవకాశాలు, వనరులు సురక్షితంగా ఉన్నాయని వివరించింది. దీంతో భారీ సంఖ్యలో స్టూడెంట్ వీసాలు జారీ సాధ్యం అయిందని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..