UPSC CISF AC 2022 exam date: సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్ కమాండెంట్‌ 2022 హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

|

Feb 22, 2022 | 4:49 PM

యూపీఎస్సీ సీఐఎస్‌ఎఫ్‌ పరీక్ష (UPSC CISF) 2021-22కు సంబంధించిన అడ్మిట్ కార్డులు సోమవారం (ఫిబ్రవరి 21) విడుదలయ్యాయి..

UPSC CISF AC 2022 exam date: సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్ కమాండెంట్‌ 2022 హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..
Upsc Cisf
Follow us on

UPSC CISF AC admit card 2022: యూపీఎస్సీ సీఐఎస్‌ఎఫ్‌ పరీక్ష (UPSC CISF) 2021-22కు సంబంధించిన అడ్మిట్ కార్డులు సోమవారం (ఫిబ్రవరి 21) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌ (ఎగ్జిక్యూటివ్) పోస్టులను భర్తీ చేయడానికి గాను డిపార్ట్‌మెంటల్ పోటీ పరీక్ష ఈ ఏడాది మార్చి 13 యూపీఎస్సీ నిర్వహించనుంది. పరీక్ష రోజున అభ్యర్ధులు ఇ-అడ్మిట్ కార్డు ప్రింట్ అవుట్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో ఐడెంటిటీ కార్డును తీసుకెళ్లాలి. CISF AC (Exe) LDCE తుది ఫలితాలు వెలువడేంత వరకు అడ్మిట్ కార్డును తప్పనిసరిగా భద్రపరచుకోవాలని యూపీఎస్సీ సూచించింది. కాగా యూపీఎస్సీ విడుదల చేసిన  సీఐఎస్‌ఎఫ్‌ ఏసీ ఎల్‌డీసీఈ ఎగ్జిక్యూటివ్‌ నోటిఫికేషన్ ద్వారా వివిధ అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

UPSC CISF AC Admit Card 2022ను ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..

  • ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌ పేజ్‌లో కనిపించే “CISF AC(EXE) LDCE 2022 – E Admit Card ” అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • సీఐఎస్‌ఎఫ్‌ రోల్‌ నంబర్ లేదా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను నమోదు చేసి, లాగిన్‌ అవ్వాలి.
  • వెంటనే స్క్రీన్‌పై అడ్మిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది.
  • అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్‌ను తీసుకోవాలి.

పరీక్ష విధానం ఇలా..

ఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. పార్ట్-ఎలో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ మొత్తం 150 మార్కులకుగాను 75 ప్రశ్నలుంటాయి. పార్ట్-బిలో ప్రొఫెషనల్ స్కిల్స్‌కు సంబంధించి 150 మార్కులకుగాను 75 ప్రశ్నలుంటాయి. పేపర్-IIలో ఎస్సే, ప్రెసిస్ రైటింగ్, కాంప్రహెన్షన్‌లు మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఈ పేపర్‌లో ఇచ్చే ఎస్సే ప్రశ్నలను ఇంగ్లీష్ లేదా హిందీలో రాయవల్సి ఉంటుంది. ఇక ప్రిసిస్ రైటింగ్, కాంప్రహెన్షన్ కాంపోనెంట్‌లు ఇంగ్లీషులో మాత్రమే రాయవల్సి ఉంటుంది.

Also Read:

ICAI CA exam 2022: సీఏ మే సెషన్‌ 2022 పరీక్షలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. ఈ తేదీల్లోనే పరీక్షలు..