Ph.d: మాస్టర్‌ డిగ్రీ అవసరం లేదు.. నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్లు PHDకి అర్హులు.. యూజీసీ సంచలన ప్రకటన

|

Dec 14, 2022 | 7:58 PM

ఇప్పుడు విద్యార్థులు PhD చేయడానికి మాస్టర్స్ చేయవలసిన అవసరం లేదు. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చేసిన తర్వాత విద్యార్థులు పీహెచ్‌డీ చేయవచ్చు.

Ph.d: మాస్టర్‌ డిగ్రీ అవసరం లేదు.. నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్లు PHDకి అర్హులు.. యూజీసీ సంచలన ప్రకటన
Ugc Chairman Jagadesh Kumar
Follow us on

యూజీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంత కాలం చదువులు వేరు.. రాబోయే రోజుల్లో చదువులు వేరు. బ్రిటీష్ కాలం నాటి మెకాలే విద్యా విధానాన్ని మార్చడం.. నూతన భారత విద్యా విధానం విద్యార్థులకు కొత్త పద్దతిలో ముందుకు వెళ్లేందుకు సులభమైన మార్గాలను తెరిచింది. కొత్త విద్యా విధానం 2020 అమలుతో పీహెచ్‌డీ చేయాలని కలలు కంటున్న గ్రాడ్యుయేట్లు మాస్టర్స్ కోర్సును అభ్యసించాల్సిన అవసరం లేదు. నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ కోర్సు చేసే విద్యార్థి నేరుగా పీహెచ్‌డీ చేయగలుగుతారు. నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉన్న విద్యార్థులు ఇకపై నేరుగా పీహెచ్‌డీ చేయవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీష్ కుమార్ బుధవారం తెలిపారు.

4 సంవత్సరాల కార్యక్రమం పూర్తిగా అమలయ్యే వరకు మూడేళ్ల గ్రాడ్యుయేషన్‌ కోర్సును నిలిపివేయబోమని యూజీసీ చైర్మన్‌ తెలిపారు. UGC చాలా కాలంగా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం కొత్త పాఠ్యాంశాలు, క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉంది. UGC జారీ చేసిన కొత్త పాఠ్యప్రణాళిక NEP 2020 ఆధారంగా రూపొందించబడింది. దీని ప్రకారం, నిబంధనలలో వెసులుబాటు ఉంటుంది. విద్యార్థులకు మునుపటి కంటే ఎక్కువ సౌకర్యాలు కూడా లభిస్తాయి. దీని కింద ఇప్పుడు నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత విద్యార్థులు పీహెచ్‌డీ చేయగలుగుతారు. వారు మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందవలసిన అవసరం లేదు.

కొత్త కరికులమ్..

ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (CBCS) అంటే ఏంటి..? UGC జారీ చేసిన కొత్త పాఠ్యాంశాలు.. క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌లో మార్చబడింది. ఒక సంవత్సరం లేదా రెండు సెమిస్టర్లు పూర్తి చేసిన విద్యార్థులు ఎంచుకున్న రంగంలో సర్టిఫికేట్ పొందుతారు. విద్యార్థులు రెండు సంవత్సరాలు లేదా నాలుగు సెమిస్టర్లు చేసిన తర్వాత డిప్లొమా పొందుతారు. అయితే, బ్యాచిలర్ డిగ్రీ మూడు సంవత్సరాలు లేదా 6 సెమిస్టర్ల తర్వాత ఇవ్వబడుతుంది.

ఇది కాకుండా, నాలుగు సంవత్సరాలు లేదా ఎనిమిది సెమిస్టర్లు పూర్తయిన తర్వాత విద్యార్థికి ఆనర్స్ డిగ్రీ ఇవ్వబడుతుంది. నాల్గవ సంవత్సరం తర్వాత, మొదటి 6 సెమిస్టర్‌లలో 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రీసెర్చ్ స్ట్రీమ్‌ను ఎంచుకోవచ్చు. ఈ పరిశోధన ప్రధాన విభాగంలో చేయవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం