Tv9-KAB Education summit: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ శనివారం నుంచి షురూ కాబోతోంది. విజయవాడలో రెండు రోజులపాటు, వైజాగ్ లో ఒకరోజుపాటు టీవీ9 – కేఏబీ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సమ్మిట్ జరగనుంది. విజయవాడ లబ్బిపేట్‌లోని ఎస్ఎస్ కన్వేన్షన్ హాల్‌లో శని, ఆదివారాల్లో, విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ గదిరాజు ప్యాలెస్‌లో ఆదివారం ఈ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. కాగా.. ఈ సమ్మిట్‌కు ప్రవేశం ఉచితం. టీవీ9-KAB సంయుక్తంగా ప్రతి ఏడాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేసేందుకు ఎడ్యుకేషన్ సమ్మిట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో విద్య, ఉద్యోగ సమాచారానికి సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులకున్న సందేహాలను నివృత్తి చేసి.. పలు సలహాలు సూచనలను ఇవ్వనున్నారు. ఈ ఏడాది కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. ఎవరికీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదస్సు నిర్వహణ ఏర్పాట్లను పూర్తిచేశారు. టీవీ9, KAB సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో పలు విద్యా సంస్థలు స్టాల్స్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నాయి.
ఈ సదస్సులో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పలు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. కరోనా తర్వాత విద్యారంగ పరిస్థితులు, హయ్యర్ ఎడ్యుకేషన్‌కి ఎలాంటి కోర్సులు చేయాలి..? ఏ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది..? టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి.. ప్రిపరేషన్ ఎలా ఉండాలి..? కరోనా కాలంలో ఉన్నత చదువులు ఎలా? ఏ ర్యాంక్‌కు ఎక్కడ సీటు వస్తుంది?.. ఏ కోర్సులు చేస్తే బాగుంటుంది..? ఇలా సందేహం ఏదైనా ఎక్స్‌పర్ట్స్ సమాధానం ఇస్తారు. కాగా.. ఈ సమ్మిట్‌కు ప్రవేశం ఉచితం. కౌన్సెలింగ్ కూడా ఫ్రీ.
కరోనా నాటినుంచి విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో కన్ఫ్యూజన్‌తోపాటు మరెన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అన్నింటినీ క్లియర్‌చేసి భవిష్యత్ మార్గనిర్దేశనం చేసేందుకు టీవీ9-KAB ఎడ్యుకేషన్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. గత 14 ఏళ్లుగా ప్రతి ఏటా ఈ సమ్మిట్ జరుగుతూ గ్రాండ్ సక్సెస్ అవుతోంది. అదే జోష్‌తో ఈసారి టీవీ9-KAB సమ్మిట్‌కు ఏర్పాట్లు గ్రాండ్‌గా పూర్తయ్యాయి. కావున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని.. ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: