TTWRCOE CET 2024 Notification: తెలంగాణ గిరిజన గురుకుల ప్రతిభా కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు.. ప్రవేశ పరీక్ష తేదీలివే

|

Jan 14, 2024 | 4:03 PM

తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌- సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌)లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్ధులకు ఇంటర్‌ రెండేళ్లు ఇంగ్లిష్‌ మీడియంలో ఉచిత..

TTWRCOE CET 2024 Notification: తెలంగాణ గిరిజన గురుకుల ప్రతిభా కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు.. ప్రవేశ పరీక్ష తేదీలివే
TTWRCOE CET 2024
Follow us on

తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌- సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌)లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్ధులకు ఇంటర్‌ రెండేళ్లు ఇంగ్లిష్‌ మీడియంలో ఉచిత విద్యతోపాటు వసతి సౌకర్యాలు అందిస్తారు. అలాగే ఐఐటీ, నీట్‌ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ కూడా ఇస్తారు. మొత్తం 1,140 సీట్లు ఉన్నాయి. వీటిల్లో బాలురుకు 660, బాలికలకు 480 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీలో 575 సీట్లు, బైపీసీలో 565 సీట్లు ఉన్నాయి. అన్ని సీట్లు ఎస్టీ కేటగిరీ విద్యార్ధులకు మాత్రమే కేటాయిస్తారు.

మార్చి-2024 పబ్లిక్‌ పరీక్షల్లో పదో తరగతి పరీక్షలకు హాజరుకాబోతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో రూ.2,00,000, గ్రామీణ ప్రాంతంలో రూ.1,50,000 మించకుండా ఉండాలి. ఇంగ్లిష్‌/ తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు ఆగస్టు 31, 2024 నాటికి 19 ఏళ్లు మించకుండా ఉండాలి. తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 రెండు దశల్లో ఉంటుంది. లెవెల్‌ 1, 2 స్క్రీనింగ్ టెస్టుల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.200 చెల్లించాలి.

పరీక్ష విధానం

లెవెల్‌-1 స్ర్కీనింగ్‌ పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు ఓఎమ్మార్‌ షీట్‌పై సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. మొత్తం 160 మార్కులకు గానూ 160 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ఎంపీసీ అభ్యర్ధులకు ఇంగ్లిష్‌లో 20 మార్కులు, మ్యాథ్స్‌లో 60 మార్కులు, ఫిజిక్స్‌లో 40 మార్కులు, కెమిస్ట్రీలో 40 మార్కుల చొప్పున పరీక్ష ఉంటుంది. బైపీసీ విద్యార్ధులకు ఇంగ్లిష్‌లో 20 మార్కులు, మ్యాథ్స్‌లో 20 మార్కులు, ఫిజిక్స్‌లో 40 మార్కులు, కెమిస్ట్రీలో 40, బయాలజీలో 40 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రశ్నపత్రం తెలుగు/ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జనవరి 13, 2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2024.
  • హాల్‌టికెట్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి 12 నుంచి 17 వరకు
  • లెవెల్‌-1 స్క్రీనింగ్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 18, 2024.
  • లెవెల్‌-2 స్క్రీనింగ్ పరీక్ష తేదీ: మార్చి 10, 2024.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.