TTWRCOE CET 2022 Results: తెలంగాణ గిరిజన గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు TTWRJC CET 2022 ఫలితాలు విడుదల

|

May 31, 2022 | 3:56 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు గిరిజన గురుకుల కాలేజీల్లో 2022-23 విద్యాసంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఆర్జేసీసెట్‌ ప్రవేశపరీక్ష 2022 ఫలితాలను గిరిజన సంక్షేమశాఖ మంత్రి..

TTWRCOE CET 2022 Results: తెలంగాణ గిరిజన గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు TTWRJC CET 2022 ఫలితాలు విడుదల
Ttwrjc Cet 2022
Follow us on

TS ST Gurukulam COE Results 2022: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు గిరిజన గురుకుల కాలేజీల్లో 2022-23 విద్యాసంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఆర్జేసీసెట్‌ ప్రవేశపరీక్ష 2022 ఫలితాలను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మంగళవారం (మే 31) విడుదల చేశారు. తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫెర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ సొసైటీ (TTWREIS) ఈ ఏడాది మార్కి 27న టీఎస్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TTWRJC CET 2022)ను నిర్వహించింది. మొత్తం 83 గిరిజన కాలేజీల్లో 8,200 సీట్లకు గానూ దాదాపు 26,042 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ http://kishoremamilla-001-site1.itempurl.com/Login.aspxలో చెక్‌ చేసుకోవచ్చు. మొదటి 1140 ర్యాంక్‌ సాధించిన విద్యార్ధులకు సీఓఈ/ఎస్‌ఓఈ/ఐఐటీ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.