TTD Medical Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పరిధిలోని తిరుపతిలోనున్న ఎస్‌వీ ఆయుర్వేద హాస్పిటల్ (SV Ayurvedic Hospital).. మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 8
ఖాళీల వివరాలు: మెడికల్ ఆఫీసర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 41 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.57,000ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఆయుర్వేదంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: The Executive Officer, T.T.D., K.T. Road, Tirupati
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 7, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.